Healthhealth tips in telugu

కీళ్లలో గుజ్జు పెరిగి, నొప్పులు మాయం అవ్వాలంటే ఈ 3 ఇలా వాడి చూడండి.

Joint Pain Home remedies In Telugu :ఈ రోజుల్లో వయసుతో పనిలేకుండా చాలామందిని ఏడిపిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు. ఉదయం లేవగానే మోకాళ్లు పట్టేయడం, మెట్లు ఎక్కుతుంటే టక్ టక్ మని శబ్దాలు రావడం… ఈ బాధ వర్ణించలేనిది కదా

ఆసుపత్రుల చుట్టూ తిరిగి, ఎన్నో మందులు వాడి విసిగిపోయారా? అయితే మీకోసం ఒక మంచి నాచురల్ రెమెడీ తీసుకొచ్చాను. మన ఇంట్లో ఉండే ఈ 3 వస్తువులను నేను చెప్పినట్లు తీసుకుంటే, కీళ్ల మధ్య మళ్లీ సహజంగా జిగురు పెరుగుతుంది. ఆ నొప్పులన్నీ ఎలా మాయమవుతాయో మీరే చూస్తారు. అవేంటో, ఎలా వాడాలో ఈ ఆర్టికల్ లో వివరంగా రాశాను, ఓసారి చదివేయండి!”

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడు మన ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.

అదే సమస్య పెద్దగా ఉంటే డాక్టర్ సూచనలు పాటిస్తూ ఇంటి చిట్కాలను కూడా ఫాలో అయితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా మనలో చాలా మంది కీళ్ళ నొప్పులతో బాధ పడుతున్నారు.

ఈ కీళ్ల నొప్పులు అనేవి కీళ్ల మధ్య గుజ్జు తగ్గినప్పుడు వస్తాయి. అలాగే కీళ్ల మధ్య శబ్దం కూడా వస్తూ ఉంటుంది. ఇలా శబ్దం రావడం కూడా కీళ్ళ నొప్పులకు సూచనగా భావించాలి. ఇలా కీళ్ల మధ్య శబ్దం రాగానే జాగ్రత్తపడాలి. ఈ సమస్య నుంచి బయటపడటానికి మంచి ఇంటి చిట్కా తెలుసుకుందాం.

వారంలో 2 సార్లు సగ్గుబియ్యం, రాగులు,సజ్జలు తీసుకుంటే ఈ సమస్యల నుండి బయట పడవచ్చు. ఇవి అందరికీ అందుబాటు ధరలోనే ఉండటమే కాకుండా విరివిగా లభ్యం అవుతాయి. రాగులు, సజ్జల వాడకం కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ అయింది. వీటిని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

సగ్గుబియ్యం
సగ్గు బియ్యం అంటే మనలో చాలా మందికి తెలుసు. సగ్గుబియ్యంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. సగ్గుబియ్యం జావగా తయారు చేసుకుని తాగుతూ ఉంటారు. సగ్గుబియ్యంలో calcium, విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన ఎముకల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

కీళ్ల మధ్య జిగురు కూడా పెరుగుతుంది. సగ్గుబియ్యము.ను జావ రూపంలోనూ, స్నాక్ రూపంలోనూ ఏ విధంగా తీసుకున్న ప్రయోజనం కలుగుతుంది. మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వలన మజిల్ గ్రోత్ కి, మజిల్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది.

రాగులు
రాగులను పూర్వ కాలం నుండి వాడుతున్నారు. రాగులును పిండి తయారు చేసుకుని జావగా తీసుకోవచ్చు. రొట్టెలు తయారుచేసుకొని తీసుకోవచ్చు. రాగులలో కాల్షియం, ఐర,న్ ప్రొటీన్లు, ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి,

ఎముకలు గుల్లగా లేకుండా బలంగా ఉండటానికి, కీళ్ల నొప్పులు తగ్గడానికి కీళ్ల మధ్య జిగురు పెరగటానికి సహాయపడుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఎందుకంటే రాగులలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది.

సజ్జలు
సజ్జల లో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్, పీచు పదార్థం వంటివి సమృద్ధిగా ఉంటాయి. .ఇవి కండరాలకు శక్తిని ఇస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

వయసు పెరిగే కొద్దీ వచ్చే ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. సజ్జలను అన్నంగా వండుకుని తీసుకోవచ్చు. సజ్జలు.ను పిండిగా తయారుచేసి రొట్టెలు చేసుకోవచ్చు. అలాగే ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య కూడా తొలగిపోతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."