ఈ ఆకు ఒక నాచురల్ పెయిన్ కిల్లర్.. దీని అద్భుత రహస్యం తెలిస్తే ఇక వదిలిపెట్టరు!
Tamalapaku Health benefits In telugu :నమస్తే అండీ! ప్రతి చిన్న నొప్పికి మెడికల్ షాప్‌కి వెళ్లి పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు తెచ్చుకుని వేసుకుంటున్నారా? ఆ క్షణానికి నొప్పి తగ్గుతుంది కానీ, అలా రోజు వేసుకుంటే భవిష్యత్తులో కిడ్నీలు, లివర్ మీద ఎంత ప్రభావం పడుతుందో కదా! అందుకే మీకోసం ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుతమైన ‘పెయిన్ కిల్లర్ ఆకు’ గురించి ఇక్కడ చెప్పబోతున్నాను.
మన కళ్లెదుటే కనిపించే ఈ ఆకులో నొప్పులను ఇట్టే లాగేసే ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఇది నిజమండీ! ఆ రహస్యం ఏంటో, ఈ ఆకుని ఎలా వాడాలో తెలిస్తే.. ఇంకెప్పుడు మీరు దీన్ని వదిలిపెట్టరు. ఆ అద్భుతమైన ఆకు ఏంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా రాశాను, ఓసారి చదివి చూడండి!
ఆకులలో ముఖ్యమైన ఆకు అయిన తమలపాకు గురించి మనకు తెలుసు. తమలపాకును పూజకు వాడుతాం. అంతేకాకుండా తాంబూలంగా స్వీకరిస్తాం. ఇక ఇందులో ఎన్నో పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తమలపాకులో విటమిన్ ఎ, సి, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఫైబర్ యాంటీఆక్సిడెంట్ సమృద్దిగా ఉంటాయి.

తమలపాకు తలనొప్పి, మైగ్రైన్ తలనొప్పి, మోకాళ్ళ నొప్పులకు దివ్య ఔషదము అని చెప్పవచ్చు. తలనొప్పి వచ్చినప్పుడు తమలపాకు ఆకులను పేస్ట్ గా చేసి నుదురుకు రాసి అరగంట అరనివ్వాలి. అప్పుడు తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. రక్తప్రసరణ బాగా జరిగి ఒత్తిడి తగ్గి నరాలు రిలాక్స్ అవుతాయి. అంతేకాకుండా మెదడు మీద ఒత్తిడి తగ్గుతుంది. దాంతో తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
అలాగే కీళ్లనొప్పులు ఉన్నప్రదేశంలో కూడా ఈ పేస్ట్ రాస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అందుకే తమలపాకును పెయిన్ కిల్లర్ ఆకు అని చెప్పవచ్చు. నొప్పులు రాగానే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకొనవసరం లేదు. ఇలా ఈ చిట్కా పాటిస్తే సరిపోతుంది. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించాలి.
ప్రతి రోజు లేత తమలపాకు ఒకటి తింటే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. ఆకుకూరల్లో ఏ విధంగా ఫైబర్ సమృద్దిగా ఉంటుందో అలాగే తమలపాకులో కూడా ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంద సమస్యలను తగ్గిస్తుంది.
జీర్ణ సంబంద సమస్యలు ఉన్నవారు భోజనం అయ్యాక ఒక చిన్న తమలపాకు తింటే సరిపోతుంది. అలాగే ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

