నరాల బలహీనత, కీళ్ల నొప్పులకు చెక్.. 7 రోజుల్లోనే అద్భుతమైన మార్పు మీరే చూస్తారు!
Dates Milk Health benefits In telugu : నమస్తే అండీ! ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని పీడిస్తున్న సమస్యలు నరాల బలహీనత, రక్తహీనత మరియు ఒంటి నొప్పులు. ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, ఏ చిన్న పని చేసినా వెంటనే అలసిపోవడం.. ఇలాంటి సమస్యలతో రోజూ ఇబ్బంది పడుతున్నారా?
అయితే మీ కోసమే ఈ అద్భుతమైన చిట్కా. కేవలం 7 రోజుల పాటు నేను చెప్పే ఈ చిన్న రెమెడీని ట్రై చేసి చూడండి. ఇది మీ నరాలకు బలాన్ని ఇచ్చి, ఒంట్లో రక్తాన్ని పెంచుతుంది. వందేళ్లు వచ్చినా సరే కీళ్ల నొప్పులు, నీరసం అనేది మీ దరిదాపుల్లోకి కూడా రావు. ఆ అద్భుతమైన చిట్కా ఏంటో, ఎలా వాడాలో ఈ బ్లాగ్ లో వివరంగా చెప్పాను, తప్పకుండా చదవండి!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. ఇప్పుడు కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులు, రక్తహీనత వంటి సమస్యలను తగ్గించుకోవటానికి పాలను తయారుచేసుకుందాం. కాస్త ఓపికగా ఈ పాలను తయారుచేసుకొని తాగితే మంచి ఫలితం కనపడుతుంది.
ముందుగా 10 ఖర్జూరాలు, 10 బాదం పప్పులను నీటిలో రాత్రి సమయంలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖర్జూరాలలో గింజలను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. నానిన బాదం పప్పు తొక్కలను తీసేయాలి. ఖర్జూరం,బాదం పప్పులను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా తయారుచేసుకోవాలి.
ఈ పేస్ట్ ని ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా వారం రోజులు నిల్వ ఉంటుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పెట్టి కాస్త వేడి అయ్యాక ఒక స్పూన్ ఖర్జూరం,బాదం పేస్ట్ ని వేసి ఒక నిమిషం మరిగించాలి. ఆ తర్వాత పావు స్పూన్ పసుపు, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న బెల్లం ముక్క వేసి 3 నిమిషాల పాటు మరిగించాలి.
మరిగిన పాలను గ్లాస్ లో పోసుకొని తాగాలి. ఈ విధంగా ఈ పాలను వారం రోజులు తాగాలి. ఆ తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి మరల వారం రోజులు తాగాలి. ఈ విధంగా ఈ పాలను తాగుతూ ఉంటే కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, రక్తహీనత వంటివి ఏమి ఉండవు. అలాగే నరాల బలహీనత సమస్య ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనం కనపడుతుంది. కాస్త ఓపికగా ఈ పాలను తాగితే మంచి ఫలితాన్ని పొందుతారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

