Healthhealth tips in telugu

ఇది ఒక్కసారి తీసుకుంటే చాలు.. 100 ఏళ్లొచ్చినా కీళ్ల నొప్పులు, బలహీనత మీ దరిచేరవు!

Jaggery and peanuts Benefits In telugu : ఈ రోజుల్లో 30, 40 ఏళ్లు రాగానే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు మొదలైపోతున్నాయి. కాసేపు నిలబడినా, మెట్లు ఎక్కినా విపరీతమైన ఆయాసం, ఏదో తెలియని నీరసం.. వీటన్నింటికీ ముఖ్య కారణం మన శరీరంలో కాల్షియం, ఐరన్ తగ్గిపోవడమే.

ఎన్నో మందులు వాడి విసిగిపోయిన వారికోసం, మన పెద్దలు పాటించిన ఒక అద్భుతమైన ఇంటి చిట్కాను ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. దీన్ని మీరు నేను చెప్పినట్లుగా వాడి చూశారంటే.. 100 ఏళ్లొచ్చినా సరే మీ ఎముకలు ఉక్కులా ఉంటాయి. రక్తహీనత, నీరసం అన్న మాటే ఉండదు. ఆ అద్భుతమైన చిట్కా ఏంటో ఈ పోస్ట్‌లో చూద్దాం రండి!

వేరుశనగల్లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే బెల్లంలో కూడా ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని విడివిడిగా తీసుకోవటం కన్నా రెండింటినీ కలిపి తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు కాలం మారి వేడి వాతావరణం నుండి చల్లని వాతావరణంలోకి వచ్చింది.
Jaggery Health Benefits in Telugu
ఈ సమయంలో వేరుశనగ,బెల్లం కలిపి తింటే శరీరం చల్లగా మారకుండా వేడిగా ఉంటుంది. అంటే శరీరానికి అవసరమైన వేడి ఉండేలా చేస్తుంది. రక్తప్రసరణ బాగా జరిగి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

కొలస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దాంతో గుండెకు సంబందించిన సమస్యలు రాకుండా ఉంటాయి. వేరుశనగలో సెలీనియం, బెల్లంలో మెగ్నీషియం మరియు ఇనుము సమృద్ధిగా ఉంటాయి.

ఇవి సంతానోత్పత్తి సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా కండరాలను బలోపేతం చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి చాలా హెల్ప్ చేస్తుంది. బెల్లంలో ఇనుము పుష్కలంగా ఉండటం వలన రక్తహీనత నుండి రక్షిస్తుంది. వేరుశనగలో కాల్షియం సమృద్ధిగా ఉండుట వలన ఎముకలను బలంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

నీరసం,అలసట,నిసత్తువగా ఉన్నప్పుడు వీటిని తింటే తక్షణ శక్తి లభించి ఉషారుగా ఉంటారు. కాల్షియం లోపం లేకుండా చేస్తుంది. శరీరంలో బలహీనత లేకుండా బలంగా ఉండేలా చేస్తుంది. ఒక స్పూన్ వేరుశనగలను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం చిన్న బెల్లం ముక్కతో కలిపి తీసుకోవచ్చు. లేదా వేరుశనగ, బెల్లంతో వేరుశనగ ఉండలు చేసుకొని తినవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."