Beauty TipsHealthhealth tips in telugu

స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే ఖరీదైన క్రీమ్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా ఈజీగా తగ్గించుకోండి!

Stretch Marks:బరువు పెరిగి తగ్గినప్పుడు లేదా ప్రెగ్నెన్సీ తర్వాత చర్మంపై వచ్చే స్ట్రెచ్ మార్క్స్ చాలామందికి పెద్ద సమస్య. వీటివల్ల నచ్చిన బట్టలు వేసుకోవాలన్నా సంకోచిస్తూ, ఆ మచ్చలను కవర్ చేసుకోవడానికి పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. నిజానికి స్ట్రెచ్ మార్క్స్ అనేవి చాలా సహజం.

కానీ, వాటిని తగ్గించుకోవడానికి ఖరీదైన క్రీమ్స్ వాడి, ఎలాంటి రిజల్ట్ రాక విసిగిపోయారా? అయితే మీకోసం ఎంతో సులువైన, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అద్భుతమైన ఇంటి చిట్కాలను ఈ ఆర్టికల్‌లో పంచుకుంటున్నాను. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే, మీ చర్మం మళ్లీ మునుపటిలా మృదువుగా, అందంగా మారుతుంది. ఒకసారి చదివి చూడండి!

స్ట్రెచ్ మార్క్స్.. మహిళలను ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది ఒకటి. అనేక కారణాలతో వచ్చే ఈ సమస్యని కొన్ని ఇంటి చిట్కాల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అవేంటో చూద్దాం.

ప్రసవం తర్వాత మహిళలకు స్ట్రెచ్ మార్క్స్ వస్తుంటాయి. అదే విధంగా బరువు పెరగడం, తగ్గడం కారణంగా కూడా ఈ మచ్చలు వస్తుంటాయి. కడుపు, భుజాలు, కాళ్లు ఇలా శరీర భాగాలపై వస్తుంటాయి.

త్వరగా బరువు తగ్గడం, లేదా అంతే త్వరగా బరువు పెరగడం, ఒత్తిడి వంటి సమస్యల వల్ల ఇవి శరీర భాగాలపై ఏర్పడుతుంటాయి. వీటిని తగ్గించుకునేందుకు మార్కెట్లో దొరికే క్రీమ్స్, ఇతర ప్రత్యామ్నాయాలను ఆశ్రయించే బదులు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

చక్కెరని ఉపయోగించి స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడం ఎలా..
చక్కెరని అందం కోసం బాగా ఉపయోగించొచ్చు. ఇందులోని ఎన్నో అద్భుత గుణాలు శరీరంపై ఏర్పడిన మచ్చలని సులువుగా పోగోడుతుంది. చక్కెరని ఆల్మండ్ ఆయిల్‌తో కలపాలి.. ఇందులో రెండు చుక్కల నిమ్మరసం వేయాలి. నూనెలో చక్కెర పూర్తిగా కరిగిపోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్ట్రెచ్‌ మార్క్స్ ఉన్న చోట రాయాలి. నెమ్మదిగా మర్దనా చేయాలి. రాసిన మిశ్రమం దాదాపు ఆరిపోయాక కడగడం, స్నానం చేయడం చేయాలి. ఇలా రెగ్యులర్‌గా నెల రోజుల పాటు చేస్తే సమస్య చాలా వరకూ తగ్గుతుంది. అయితే.. ఈ మిశ్రమంతో ఎక్కువగా రుద్దొద్దు.. సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం ఎలాంటి మచ్చలు అయినా తగ్గిపోతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."