Healthhealth tips in telugu

పసుపు ఎక్కువగా వాడుతున్నారా…ఈ 7 నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు

Turmeric overuse Side effects: భారతీయులు వంటకాల్లో వినియోగించే పసుపు రుచిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. కేవలం వంటకాల్లో రుచి మాత్రమే కాదు. పసుపు ఓ యాంటీ బయోటిక్‌గా కూడా ఉపయోగపడుతుంది. పసుపులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల మనలో చాలామంది పసుపును ఎక్కువగా వాడుతూ ఉంటారు.

ఈ మధ్యకాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగటానికి కూడా పసుపును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పసుపును లిమిట్ గా వాడితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అదే ఎక్కువగా వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. పసుపు ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి.

పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువ అయ్యి కడుపుకు సంబంధించిన సమస్యలు కడుపు నొప్పి, కడుపులో మంట వచ్చే అవకాశం ఉంది. ఇది డయేరియాకి కారణం కావచ్చు. ఐరన్ లోపం ఉన్నవారు పసుపు వాడటం తగ్గించాలి. ఎందుకంటే పసుపు కారణంగా శరీరం ఐరన్ తీసుకోవటం తగ్గుతుంది. పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల వికారం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఎలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంది.

అయితే రోజులో ఎంత పసుపు తీసుకోవచ్చు అనే విషయలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. రోజుకి అరస్పూన్ మోతాదులో పసుపు తీసుకోవచ్చు. అంతకు మించి తీసుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా మోతాదు మించితే అనర్ధమే కదా.. కాబట్టి సరైన మోతాదులో తీసుకొని వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందాలి.