Healthhealth tips in telugu

వాముతో ఇలా చేస్తే దగ్గు,జలుబు, గొంతు నొప్పి,ఛాతిలో కఫం నిమిషాల్లో మాయం…జన్మలో రాదు

Home remedies for common cold and cough In Telugu : వాతావరణం మారింది. చలిగాలులు ఎక్కువ వేస్తున్నాయి. ఉదయం సమయంలో విపరీతమైన మంచు ఉంటుంది. ఇలాంటి సమయంలోనే దగ్గు., జలుబు, ఛాతీలో కఫం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలకు ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.
ajwain seeds and kidney stones
ఇప్పుడు చెప్పే చిట్కా శ్వాసనాళాలను శుభ్రపరచటమే కాకుండా దగ్గు,జలుబు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఈ చిట్కా కోసం ఉపయోగించే ఇంగ్రిడియన్స్ అన్నీ ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. కాబట్టి కాస్త శ్రద్ద పెడితే సరిపోతుంది.

ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి దానిలో ఒక స్పూన్ వాము, గుప్పెడు పుదీనా ఆకులు, రెండు కర్పూరం బిళ్ళలు వేసి నీటిని బాగా మరిగించాలి. ఈ నీరు బాగా మరిగి పొగలు వస్తున్నప్పుడు, పొయ్యి మీద నుంచి దించి దుప్పటి సాయంతో ఆవిరిని కొంతసేపు ముక్కుతో కొంతసేపు నోటితో పీల్చడం వల్ల శ్వాస నాళాలు శుభ్రపడి ఊపిరితిత్తుల్లో కఫం బయటకు వచ్చేస్తుంది.

రోజులో రెండు సార్లు ఈ విధంగా చేస్తే దగ్గు, జలుబు నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది. కర్పూరం మంచి వాసన ఇవ్వటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దాంతో దగ్గు, జలుబు తొందరగా తగ్గుతాయి.పుదీనా ఘాటైన వాసన కలిగి ఉండటం వల్ల శ్వాస సమస్యలను తగ్గిస్తుంది. వాములో ఉండే ఘాటైన రసాయనాలు జలుబు, దగ్గు తగ్గించడంలో సహాయపడటమే కాకుండా కఫం కరగడంలో కూడా సహాయపడతాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."