Healthhealth tips in telugu

రక్తం తక్కువగా ఉందా? ఈ 1 గ్లాస్ తో ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది!

Anemia home remedies in Telugu : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలామంది రక్తహీనత, అలసట, నీరసం లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. శరీరంలో తగినంత రక్తం లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

అయితే, ఖరీదైన మందులు వాడాల్సిన అవసరం లేకుండా, రోజుకు కేవలం 1 గ్లాస్ ఈ అద్భుతమైన పానీయాన్ని తీసుకుంటే.. మీ ఒంట్లో రక్తం వేగంగా వృద్ధి చెందుతుంది. అసలు ఆ డ్రింక్ ఏంటి? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి? దాని వల్ల కలిగే ఇతర లాభాలు ఏంటి? అనే పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.

శరీరంలో తగినంత రక్తం లేకపోవడాన్ని రక్తహీనత సమస్య అని అంటారు. రక్తహీనతను ఎనిమియా అని కూడా పిలుస్తారు. శరీరంలో తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేదా హిమోగ్లోబిన్ లేనప్పుడు,రక్తహీనత సమస్య వస్తుంది. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, సరైన జీవనశైలి లేకపోవడం, విటమిన్స్ లోపం వలన ఈ సమస్య వస్తుంది.

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిలోనూ రక్తహీనత సమస్య కనబడుతుంది. ముఖ్యంగా స్త్రీలు మరియు పిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది. చాలామందికి రక్తహీనత సమస్య ఉందని కూడా తెలియదు. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు ఇంటిలో ఒక డ్రింక్ తయారుచేసుకొని తాగితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది.

దీని కోసం చిన్న క్యారెట్, చిన్న బీట్ రూట్ లో సగం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడికించాలి. ఉడికిన క్యారెట్ ముక్కలు,బీట్ రూట్ ముక్కలను నీటిని పోసి మిక్సీ చేయాలి. దీనిలో చిన్న బెల్లం ముక్క, అరచెక్క నిమ్మరసం వేసి మరొక సారి మిక్సీ చేసి గ్లాస్ లో పోసి తాగాలి.

ఈ డ్రింక్ ని ప్రతి రోజు తాగితే 15 రోజుల్లోనే రక్తహీనత సమస్య తగ్గటం గమనిస్తారు. సమస్య చిన్నగా ఉంటే ఈ డ్రింక్ తాగితే సరిపోతుంది. సమస్య పెద్దగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలను పాటిస్తూ ఈ డ్రింక్ తాగితే చాలా తొందరగా సమస్య నుంచి బయటపడవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."