Beauty Tips

Warts:రాత్రి ఇలా చేస్తే పులిపిర్లు నొప్పి లేకుండా ఉదయానికి రాలిపోతాయి

How to Remove Pulipiri in Telugu : పులిపిర్లు అనేవి వయస్సుతో సంబందం లేకుండా వస్తాయి. పులిపిర్లు వాటి ఆకారంలో విభిన్నంగా ఉంటాయి,అంటే అనేక రకాల ఆకారాల్లో శరీరంపై ఏర్పడి,చూడటానికి అందవిహీనంగా కనపడతాయి. పులిపిర్లు రాగానే మనలో చాలా మంది కంగారు పడి మార్కెట్ లో దొరికే కొన్ని క్రీమ్ లు వాడుతూ ఉంటారు. అలా వాడకుండా ఇంటి చిట్కాలను ట్రై చేయవచ్చు.

పులిపిర్లు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో కూడా వస్తాయి. పులిపిర్లు ఉన్నవారు వాటిని గిల్లటం,కాల్చటం మరియు కత్తరించటం వంటి పనులు అసలు చేయకూడదు. పులిపిర్లు మన శరీరంలో ఏ బాగంలోనైనా రావచ్చు. పులిపిర్లు తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడే ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు.

పులిపిర్లు అనేవి వైరస్ కారణంగా వస్తాయి. అందువల్ల పులిపిర్లను తగ్గించుకోవటానికి తులసి ఆకులు బాగా సహాయపడతాయి. ఆయుర్వేద ఔషధాలలో తులసి ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇందులో వైరస్ ని ఎదుర్కునే యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉంటాయి.

తాజా తులసి ఆకులను తీసుకొని మెత్తని పేస్ట్ గా చేసి పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాసి,దాని మీద గాలి తగలకుండా ఒక టేప్ తో మొత్తం కవర్ అయ్యేలా చుట్టాలి. రెండు గంటలు అయ్యాక టేప్ తీసేసి చల్లని నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. లేదా ఈ విధంగా రాత్రి సమయంలో చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసిన సరిపోతుంది. నాలుగు రోజుల ఇలా చేస్తే పులిపిర్లు రాలిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."