Healthhealth tips in telugu

Broccoli:వారంలో 2 సార్లు..100 ఏళ్ళు వచ్చిన కీళ్ల నొప్పులు,వెన్నునొప్పి,బలహీనత,కాల్షియం లోపం ఉండవు

Broccoli Health Benefits In telugu : బ్రకోలీ ఒకప్పుడు చాలా అరుదుగా లభించేది. కానీ ప్రస్తుతం విరివిగానే లభిస్తుంది. బ్రకోలీలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యాబేజీ కుటుంబం నుండి వచ్చిన బ్రకోలీ ఆకుపచ్చని రంగులో ఉంటుంది. విటమిన్ సి, జింక్, కాపర్, బి విటమిన్లు, ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, విటమిన్ కె, కాల్షియం సమృద్దిగా ఉంటాయి.
broccoli
బ్రోకలీలో కాల్షియం మరియు విటమిన్ K సమృద్దిగా ఉండుట వలన ఎముకల ఆరోగ్యానికి మరియు బోలు ఎముకల వ్యాధి నివారణకు సహాయ పడుతుంది. కాల్షియంతో పాటు, బ్రోకలీలో మెగ్నీషియం, జింక్ మరియు ఫాస్పరస్ వంటి ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఎదిగే పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ మంచిదే పాలిచ్చే తల్లులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఆకుపచ్చగా ఉండే ఈ కూరగాయలో సల్ఫోరాఫేన్ అనే ఫైటోకెమికల్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తుంది. బ్రకోలీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. బ్రకోలీలో ఉండే ఇండోల్-3 కార్బినోల్, కెంప్ఫెరాల్ వంటి సమ్మేళనాలు కూడా వాపును, మలినాలను తగ్గిస్తాయి.

బ్రకోలీలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన డయబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ఇతర కూరగాయలతో పోలిస్తే దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ సూపర్ ఫుడ్‌లో ఉండే క్వెరెసిటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తూ, గుండె సంబంధ అనారోగ్యాలను దూరం చేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.