Healthhealth tips in telugu

15 రోజులు – అరస్పూన్ నీళ్ళలో కలిపి తాగితే కీళ్ల నొప్పులు,కీళ్ల మధ్య శబ్ధం తగ్గి జిగురు పెరుగుతుంది

Joint pains Home Remedies in telugu : కీళ్ల మధ్య జిగురు అనేది కీళ్ళు సాఫీగా కదిలేలా చేస్తుంది. ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా కీళ్ల మధ్య జిగురు తగ్గిపోయి కీళ్ళు అరిగిపోయి నొప్పులు వస్తున్నాయి. ఈ సమస్య ప్రారంభంలో ఉంటే ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అయితే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ సూచనలను పాటిస్తూ ఈ రెమిడీ ఫాలో అవ్వవచ్చు.
sonthi podi health benefits in telugu
దీని కోసం 3 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ముందుగా 50 గ్రాముల శొంఠిని ముక్కలుగా కట్ చేసి నూనె లో వేగించి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. ఆ తర్వాత 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల వాము తీసుకొని పాన్ లో వేగించి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. మెంతులు,వాము పొడిలో శొంఠి పొడిని కలపాలి.

ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరస్పూన్ పొడి కలిపి తాగాలి. ఈ విధంగా 15 రోజులు తాగితే చాలా తేడా కనిపించి ఆశ్చర్యం కలుగుతుంది.
fenugreek seeds
మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లే మేటరీ లక్షణాలు ఉండటం వలన నొప్పి,వాపును తగ్గించటంలో సహాయపడతాయి. శొంఠిలో ఉన్న లక్షణాలు కీళ్ల వాపులను తగిస్తాయి. ఈ పొడి ప్రతి రోజు తీసుకుంటే కీళ్ల నొప్పులు, కీళ్ల మధ్య శబ్ధం తగ్గి కీళ్ల మధ్య జిగురు పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."