MoviesTollywood news in telugu

సుకుమార్ కారణంగా పుష్ప నిర్మాతలకు కోట్ల నష్టం…నిజమా ?

Pushpa Movie Makers Loss : అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనల్‌లో వచ్చిన క్రేజీ హ్యాట‍్రిక్‌ చిత్రం పుష్ప: ది రైజ్‌ మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. డిసెంబర్‌ 17న విడుదలైన పుష్ప సినిమా విశేష ప్రేక్షాదరణ పొందుతున్నప్పటికీ ఈ సినిమా వెస్టీజ్ కి సంబంధించి 30కోట్లు నష్టపరిచేలా డైరెక్టర్ సుకుమార్ వ్యవహరించాడని ఒక వార్త తాజాగా వైరల్ అవుతోంది.

రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేసిన ఈ మూవీలో స్టార్‌ హీరోయిన్‌ సమంత స్పెషల్‌ సాంగ్‌లో అలరించింది. ఇక పుష్ప 2కూడా రాబోతోంది. దీనిపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. అయితే రెండున్నర గంటల సినిమాకు 4గంటల ఫుటేజ్ తీస్తారని అయితే పుష్ప విషయంలో వెస్టీజ్ ఎక్కువ అయిందని అంటున్నారు.

పోనీ వెస్టీజ్ కాకుండా పుష్ప 2లో పెడదామా అంటే అక్కడ కూడా పనికొచ్చేలా లేదట. ముఖ్యంగా సమంత స్పెషల్ సాంగ్ లో ఫుటేజ్ ఎక్కువ తీయడం వలన కోటి రూపాయల వరకూ నష్టపోయారని టాక్. డైరెక్టర్ సుకుమార్ తగు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వలన మొత్తం మీద 30 కోట్లు నష్టమని అంటున్నారు. వెస్టీజ్ సహజమే అయినా ఇదీ మరీ ఎక్కువని గుసగుసలు విన్పిస్తున్నాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."