ఈ సంవత్సరం ఆకట్టుకున్న సినీ జోడీలు ఏవో ఒకసారి చూడండి
2021 best jodis in tollywood : ఫలానా హీరో, ఫలానా హీరోయిన్ అయితే సూపర్ గా సూటవుతుందని ఆడియన్స్ అంచనాకొస్తారు. ఆడియన్స్ అభిరుచి మేరకు దర్శక నిర్మాతలు హీరో హీరోయిన్స్ జోడీని సెలెక్ట్ చేస్తుంటారు. ఇక ఈ ఏడాది కొన్ని జంటలు బాగా అలరించాయని టాక్. ఒకప్పుడు చంటి, సుందరకాండ, అబ్బాయిగారు, సూర్యవంశం వంటి సినిమాలతో ఆకట్టుకున్న విక్టరీ వెంకటేష్, మీనా జంట ఇటీవల దృశ్యం, ఆతర్వాత దృశ్యం 2లో కూడా నటించి మెప్పించారు.
ఇక హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన గబ్బర్ సింగ్ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన శృతిహాసన్ నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇదే జంట వకీలు సాబ్ మూవీతో ఈ ఏడాది హిట్ కొట్టింది. నేచురల్ స్టార్ నాని,సాయిపల్లవి ఎంసిఎ మూవీతో అక్కట్టుకుని, ఈ ఏడాది శ్యాం సింగరాయ్ తో ఆకట్టుకున్నారు.
ఇక మాస్ మహారాజ్ రవితేజ శృతిహాసన్ జంటగా వచ్చిన బలుపు సినిమా గతంలో హిట్ అందుకుంది. ఇటీవల చేసిన క్రాక్ మూవీతో ఈ జంట ఆడియన్స్ ని అలరించింది. మొత్తానికి 2021 లో టాలీవుడ్ లో కొన్ని జంటలు హిట్ ఫెయిర్ గా నిలిచాయి.