MoviesTollywood news in telugu

స్టైలీష్‏గా ఫోటోలకు ఫోజులిస్తున్న ఈ చిన్నోడు ఇప్పుడు స్టార్ హీరో…ఎవరో…?

Tollywood Hero Ram pothineni : చిన్నప్పటి ఫోటోలు ఎవరివి చూసినా చాలా బాగుంటాయి. గతకాలపు గుర్తులు మదిలో మెదులుతాయి. ఇక సెలబ్రిటీల చిన్నప్పటి ఫోటోలైతే చెప్పక్కర్లేదు. పైగా సోషల్ మీడియా వాడకంలో సెలబ్రెటీలు ముందున్నారు. దీంతో ఫాన్స్ తో ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోడానికి ముచ్చడించాడానికి వీలుగా ఉంటోంది.

అందుకే ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్,మూవీ అప్డేట్స్ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ, అభిమానులతో టచ్ లో సెలబ్రెటీలు ఉంటున్నారు. అభిమానులు సైతం తమ అభిమాన హీరో హీరోయిన్ గురించి తెలుసుకోవడానికి ఆత్రుత చూపిస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు , హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోలు వైరల్ అవ్వగా, తాజాగా మరో స్టార్ హీరో ఫోటో హల్ చల్ చేస్తోంది.

ఇంతకీ అతనేవరా అని చూస్తే, ఇప్పుడు స్టార్ హీరో గా యూత్‏లో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న రామ్ పోతినేని ఫోటో అని తెల్సి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ ఓ మూవీ చేస్తున్నాడు. కాగా ఇటీవల పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. రామ్ చిన్ననాటి ఫోటోలు చూసి, సో క్యూట్ అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.