Healthhealth tips in telugu

Nerves weakness:ప్రతి రోజు పాలతో కలిపి తీసుకుంటే నరాల బలహీనత,నరాలలో అడ్డంకులు అనేవి అసలు ఉండవు

Nerves weakness in telugu : ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా ఎన్నో రకాల సమస్యలు వచ్చేస్తు ఉన్నాయి. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. అదే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ ని సంప్రదించి ఆ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.

నరాల బలహీనత, నరాలలో అడ్డంకులు అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనపడుతుంది. డయబెటిస్ ఉన్నవారిలో కూడా ఇటువంటి సమస్యలు వస్తాయి. నరాల బలహీనత సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు. రాత్రి సమయంలో 5 బాదం పప్పులను నానబెట్టాలి. 3 స్పూన్ల ఆవిసే గింజలను చిటపట లాడే వరకు వెగించాలి.

వేగిన ఆవిసే గింజలను మిక్సీ జార్ లో వేసి ఆ తర్వాత అరస్పూన్ శొంఠి పొడి, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, అరస్పూన్ పసుపు వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో అరస్పూన్ పొడి కలిపి ప్రతి రోజు ఉదయం తాగాలి. ఆ తర్వాత నానబెట్టిన బాదం పప్పులను తొక్క తీసి తినాలి.

ఈ విధంగా పది రోజుల పాటు చేస్తే మీకు అన్నీ రకాల సమస్యల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. శొంఠి పొడి, దాల్చిన చెక్క పొడి, పసుపు ఈ మూడు మార్కెట్ లో దొరికే పాకెట్స్ కొనకుండా ఇంటిలో తయారుచేసుకుంటే మంచిది. ఆవిసే గింజలలో ఉండే పోషకాలు నరాల బలహీనత తగ్గించటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."