చిప్స్ ఇష్టం వచ్చినట్టు తింటున్నారా…అయితే పెద్ద ప్రమాదంలో పడినట్టే… !
potato chips : పిల్లల నుంచి పెద్దవారి వరకు చిప్స్ అంటే ఇష్టం లేనివారు ఉండరు. పిల్లలు అన్నం తినటానికి మారం చేస్తారు. కానీ చిప్స్ అనగానే పరిగెత్తుకుని వచ్చి మరీ తింటూ ఉంటారు. పిల్లలకు స్పైసీ చిప్స్, జంక్ ఫుడ్ పెట్టడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిన మనం పెడుతూ ఉంటాం. శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న చిప్స్,జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం వలన అధిక బరువు సమస్యతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

అయితే సాధారణంగా మనలో చాలా మంది పిల్లలు చిప్స్ ఇష్టంగా తింటున్నారని చూసి చూడనట్టు వదిలేస్తూఉంటాం. స్పైసీగా కనిపించే చిప్స్ చూడగానే నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది. ఇక చాలా సందర్భాల్లో స్పైసీ చిప్స్‌ను టైమ్‌పాస్‌గా తినేస్తుంటారు కొంతమంది. చిప్స్ లో సోడియం ఎక్కువగా ఉండుట వలన రక్తపోటు పెరుగుతుంది.
కొలస్ట్రాల్ పెరుగుతుంది. కొలస్ట్రాల్ పెరిగితే గుండెకు సంబందించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిప్స్ ఎక్కువగా తింటే పిత్తాశయంలో సమస్యలు అలాగే రాళ్ళూ ఏర్పడే అవకాశం ఉంది. అయితే బంగాళాదుంపను వేగించకుండా ఉడకబెట్టి తింటే ఏ ముప్పూ ఉండదని వారు అంటున్నారు. అయితే ఎప్పుడో ఒక్కసారి తింటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
కానీ అదే పనిగా ఎక్కువగా తింటే మాత్రం ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాసెసింగ్ విధానం వల్ల బంగాళాదుంప చిప్స్ విటమిన్లు మరియు ఖనిజాలు వంటి పోషకాలను కోల్పోతాయి. సాధారణంగా బంగాళాదుంపలలో లభించే పిండి సమ్మేళనాలు, అధిక స్థాయిలో సోడియం సంరక్షణకారిగా ఉంటాయి. బంగాళాదుంప చిప్స్‌లో హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండవచ్చు, ఇవి రక్తం ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెంచడం వంటి అన్ని రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.

