Healthhealth tips in telugu

బ్లాక్ రైస్ తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే…అసలు నమ్మలేరు

Black Rice Benefits In telugu : నల్ల బియ్యం గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ మధ్య కాలంలోనే ఈ బియ్యం చాలా ప్రాచుర్యం పొందాయి. నల్ల బియ్యంలో 18 రకాల అమినో యాసిడ్స్,కాపర్, కెరోటిన్ వంటివి సమృద్ధిగా ఉండటం వల్ల సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటి ధర కేజీ 300 రూపాయిల వరకు ఉంటుంది.
black rice
నల్ల బియ్యం ఇన్సులిన్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచి డయాబెటిస్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఈ బియ్యంలో కేలరీలు తక్కువగానూ ఫైబర్ ఎక్కువగానూ ఉండటం వల్ల శరీరంలో కొవ్వును చాలా స్పీడ్ గా కరిగించి అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. కేరళ ఆయుర్వేదంలో నరాల బలహీనత ఉన్నవారికి ఈ బియ్యాన్ని మసాజ్ చేసేందుకు ఉపయోగిస్తారు.
Immunity foods
ఈ బియ్యంలో ఉండే ఆంకోసైనిన్స్‌ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి రోగ నిరోధక ఎంజైములను క్రియాశీలకం చేసి శరీరంలో రోగనిరోదక వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది. లివర్ డీటాక్సిఫికేషన్ లో కూడా ఈ బియ్యం తోడ్పడుతుంది. అధిక రక్త పోటు సమస్య నుంచి కూడా కాపాడి గుండెకు సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది.
gas troble home remedies
నల్ల ధాన్యాలు మంచి రుచిని కూడా కలిగి ఉంటాయి. అందుకనే ఎక్కువగా తీపి వంటలు చేయాడనికి నల్ల బియ్యాన్ని ఉపయోగిస్తారు.బ్లాక్ రైస్ లో ఉండే ఫైబర్‌ జీర్ణసంబంధ సమస్యలను తగ్గిస్తుంది. బ్లాక్ రైస్ లో ఆంథోసైయనిన్లు ఎక్కువగా ఉంటాయి. ఆంథోసైయనిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

ఆంథోసైయనిన్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గటానికి అవకాశం కలుగుతుంది. బ్లాక్ రైస్‌లోని యాంటీఆక్సిడెంట్లు కాలేయంలో కొవ్వు పెరుకుపోకుండా చేసి కాలేయన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
eye sight remedies
బ్లాక్ రైస్ లో బ్లాక్ రైస్‌లో అధిక మొత్తంలో లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు లేకుండా కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. బ్లాక్ రైస్‌లోని విటమిన్ ఇ , కెరోటినాయిడ్‌లు కూడా కళ్లపై యువి రేడియేషన్‌ను తగ్గిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.