Healthhealth tips in telugu

ముల్లంగితో కూర వండినప్పుడు ఆకులు పాడేయకండి…ఈ అద్భుతమైన లాభాలను పొందవచ్చు..!

Radish Leaves Juice Benefits : ఈ చలికాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టాలి. ఎందుకంటే సీజనల్ గా వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల మీద దృష్టి పెట్టాలి. మనం ముల్లంగి వండినప్పుడు ఆకులను పాడేస్తూ ఉంటాం. ఆ ఆకులలో ఎన్నో పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
radish beenfits
ముల్లంగి ఆకులతో జ్యూస్ చేసుకొని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. దీనిలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. దీనిలో ఉన్న పోషకాలు బరువు తగ్గటానికి సహాయపడతాయి. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

ముల్లంగి ఆకులలోని సోడియం శరీరంలో ఉప్పు కొరతను తీర్చి.. బీపీని నివారిస్తుంది.ఐరన్ సమృద్దిగా ఉండుట వలన హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తాన్ని శుద్ది చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పైల్స్ సమస్యను కూడా తగ్గిస్తుంది. వీటిలో ఉండే విటమిన్ సి, విటిమన్ ఎ, థైమిన్ వంటివి అలసటను,నీరసంను తగ్గిస్తుంది.

ముల్లంగి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా పంచదార మిక్స్ చేసి, నొప్పులు, వాపులున్న జాయింట్స్ లో అప్లై చేయాలి. ఈ పేస్ట్ ను రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే, నొప్పులు, వాపులు తగ్గుతాయి. మూడు ముల్లంగి ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి కొంచెం నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసి దానిలో నల్ల ఉప్పు, నిమ్మరసం కలిపి మరోసారి మిక్సీ చేసి వడకట్టి తాగాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."