Healthhealth tips in telugu

పైల్స్ సమస్య ఉన్నవారు ఇలా చేస్తే చాలు…శాశ్వతంగా మాయం అవుతాయి

Home Remedies For Piles : మారిన జీవన విధానంలో చాలా మందిని పైల్స్ సమస్య వేధిస్తోంది. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పి, రక్తస్రావం, మలద్వారం చుట్టూ వాచిపోవడం వంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్య ఉన్న వారు ఒకచోట కూర్చోలేరు. నిల్చో లేరు. ఈ సమస్యను అశ్రద్ధ చేయకూడదు.
piles home remedies
ఈ సమస్య స్వల్పంగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అదే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ ని తప్పనిసరిగా సంప్రదించాలి. డాక్టర్ సూచనలు పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలు ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. దానిమ్మ తొక్కలు ఫైల్స్ సమస్యను తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి.
pomegranate Benefits in telugu
దానిమ్మ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అలాగే విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఏ, ఐరన్ మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఆయుర్వేదంలో దానిమ్మ తొక్కల పొడిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. దానిమ్మ తొక్కలను బాగా ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవాలి.
Piles Fruits
దానిమ్మ తొక్కల పొడిలో కొద్దిగా బెల్లం వేసి మళ్లీ మిక్సీ చేయాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఉదయం సాయంత్రం తీసుకుంటే పైల్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇటువంటి ఆయుర్వేద చిట్కాలను వాడినప్పుడు ఒకసారి ఆయుర్వేద వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది. ఈ ఆర్టికల్ ఒక అవగాహన కోసం మాత్రమే.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.