Healthhealth tips in telugu

ఈ జావ ఉదయం పూట త్రాగితే పొట్ట,కొవ్వు తగ్గటమే కాకుండా శరీరంలో వేడిని తగ్గిస్తుంది

Saggubiyyam : సగ్గుబియ్యం మన ఇళ్లల్లో తరతరాల నుంచీ వాడుతున్న ఆహారపదార్థమే. అయితే దీనిని ఉపయోగించడం ద్వారా శరీరంలోని అదనపు బరువును తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం. సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్స్‌ ఎక్కువగా లభిస్తాయి. కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది.
Saggubiyyam Health benefits in Telugu
అందువల్ల బరువు తగ్గాలని అనుకునే వారు సగ్గుబియ్యం తీసుకుంటే శరీరంలో ఉన్న కొవ్వు శాతం తగ్గించుకోవచ్చు. సగ్గుబియ్యం తేలికగా జీర్ణమయ్యే ఆహారం కాబట్టి పాలు తరువాత చిన్న పిల్లలకి తినే ఆహార పదార్ధంగా సగ్గుబియ్యాన్ని సూచిస్తారు వైద్యులు. సగ్గుజావలో సగ్గు బియ్యం,పాలు,బెల్లం ఇవి కలపడం వల్ల సగ్గుజావ ఒంట్లో వేడిని తగ్గించి శరీరాన్ని చలవగా ఉంచుతుంది.

పైగా దీనిలో అధికంగా ఉండే పీచు పదార్ధం ఒంట్లో అధిక బరువుని తగ్గిస్తుంది ఇంకా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అలాగే పాలు మంచి కాల్షియం మరియు ప్రోటీన్లు కలిగి ఉంటుంది,ఇది మనిషికి ఎండతో శక్తిని మరియు బలాన్ని ఇస్తుంది ఇంకా బెల్లం ఐరన్ పుష్కలంగా ఉంటుంది,ఇది రక్తహినతని తగ్గించి మంచి పోషణను అందిస్తుంది.
saggubiyyam java health benefits In Telugu
ముందుగా సగ్గుబియ్యాన్ని నీళ్ళలో ఒక అరగంట నానాబెట్టాలి తరువాత నీళ్ళలో ఒక పావుగంట ఉడికించి ఇప్పుడు పాలు పొయ్యాలి తరువాత ఒక ఐదు నిమిషాల తరువాత బెల్లం ముక్క చిన్నది వేసి కలిపి గ్లాసులో పోసుకుని త్రాగాలి. ఇది ఉదయం పూట టిఫిన్ తిన్నాక మరియు అన్నం తినే మధ్యలో త్రాగాలి లేదా టిఫిన్ బదులు తీసుకోవచ్చు లేదా సాయంత్రం పూట ఈ చలువ చేసే జావ త్రాగాడానికి ఎలాంటి నియామాలు లేవు. అందుకే ఎన్ని సార్లు కావాలి అంటే అన్ని సార్లు త్రాగండి సులువుగా బరువు తగ్గించుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.