హైబీపీ ఉన్నవారు వీటిని తింటే జీవితంలో అధిక రక్తపోటు అనేది ఉండదు
High Blood Pressure : హైబీపీ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే రక్తపోటు సమస్య వచ్చేస్తుంది. కొన్ని ఆహారాలను తీసుకుంటే నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా నైట్రేట్స్ ఉన్న ఆహారం తీసుకుంటే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

అధిక రక్తపోటు అనేది సైలెంట్ కిల్లర్ గా మారి శరీరంలోని అవయవాలను దెబ్బతీస్తుంది.కాబట్టి రక్తపోటు సమస్య రాగానే డాక్టర్ సూచించిన మందులను వాడుతూ ఇప్పుడు చెప్పే ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఓట్స్ లో బీటా గ్లూకెన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అలాగే బీపీని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది.

హైబీపీని నియంత్రించటంలో అరటి పండు మంచి ఔషదంలా పనిచేస్తుంది. వీటిలో పొటాషియం సమృద్దిగా ఉంటుది. ఒక మీడియం సైజు అరటి పండులో ఉండే పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల హైబీపీ తగ్గుతుంది. రోజు ఒక కివి పండు తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

బెర్రీ జాతి పండ్లు తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. వీటిలో యాంథోసైనిన్లు అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు బీపీని తగ్గించటంలో సహాయ పడతాయి. డార్క్ చాక్లెట్ కూడా రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రక్తపోటును తగ్గించడంలో అవిసె గింజలు శక్తివంతమైన సూపర్ ఫుడ్ అని పరిశోదనలు తెలుపుతున్నాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

