Healthhealth tips in telugu

ఈ పండును డైట్ లో చేర్చుకుంటే ఎన్నో వ్యాధులకు దూరంగా ఉండవచ్చు…సంజీవని వంటిది

mulberry fruit benefits : మల్బరీ పండ్లు గురించి తెలిసిన వీటిని తినటానికి చాలా మంది ఆసక్తి చూపరు. వీటిని ఎక్కువగా షర్బత్ లు, స్వ్కాష్ లు, జెల్లీలు, సలాడ్స్ వంటి వాటిలో వాడుతూ ఉంటారు. మల్బరీ పండ్లలో విటమిన్ ఏ, బి, సి, డి ఉన్నాయి. వీటితో పాటు క్యాల్షియం, ఐరన్, జింక్, ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి.
mulberry fruit
ఈ పండ్లలో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ పండ్లను తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి రక్తప్రసరణ బాగా సాగేలా చేయటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మల్చరీలలో రెస్వెరట్రాల్‌ అనే యాంటీయాక్సిడెంట్‌ సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

అంతేకాకుండా రెస్వెరట్రాల్‌ నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది అది ఒక వేసోడైలేటర్‌ గా పని చేసిన రక్త నాళాలను సడలించేలా చేస్తుంది.
మల్బరీ పండ్లలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన ఎర్రరక్త కణాల పెరుగుదలకు దోహదం చేయటమే కాకుండా శరీర కణాలకు వేగంగా ఆక్సిజన్ సరఫరా చేయటంలో సహాయపడుతుంది.
gas troble home remedies
వీటిల్లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ ప్రక్రియ వేగంగా జరిగేలా చేసి గ్యాస్,కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగ నిరోధక శక్తి బలంగా ఉండేలా చేసి మన శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియా ఇన్ ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది.
Diabetes In Telugu
డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పండ్లను తినవచ్చు. ఇందులో ఉండే ప్లాస్మా రక్తంలో గ్లూకోజ్ ని తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. నరాలు బలహీనంగా లేకుండా బలంగా ఉండేలా చేస్తుంది. విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటికి సంబందించిన సమస్యలు ఏమి ఉండవు.
Wrinkles remove Tips In Telugu
వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. చర్మం మీద ముడతలను తగ్గించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. .జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఈ పండ్లు డ్రై రూపంలో కూడా లభ్యం అవుతాయి. వారంలో రెండు సార్లు ఈ పండ్లను తింటే ఈ పండులో ఉన్న పోషకాలు మన శరీరానికి అందుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.