Healthhealth tips in telugu

ప్రతి రోజు ఎర్ర కారం తినే ప్రతి ఒక్కరూ ఈ నిజాన్ని తెలుసుకోవాలి…లేదంటే…?

Red Chilli Powder Benefits in telugu :మనం ప్రతి రోజు వండుకునే వంటల్లో కారం తప్పనిసరిగా వేస్తాం. కూరల్లో సరిగ్గా కారం పడకపోతే ముద్ద దిగదు. కొంత మంది పచ్చి మిరపకాయలు వాడితే … మరికొంత మంది ఎండు కారం వాడుతూ ఉంటారు. కొంత మంది కారం ఎక్కువగా తింటారు.
Red Chilli
మరి కొంత మంది కారం అంటే ఇష్టపడరు. అయితే ఇప్పుడు చెప్పే విషయాలను తెలుసుకొంటే కారం తినని వారు కూడా కారాన్ని ఇష్టంగా తింటారు. కానీ, ఇటీవల రకరకాల అనారోగ్యాల పేరుతో కారానికి దూరంగా ఉంటున్నారు చాలా మంది. కానీ తగినంత మోతాదులో కారాన్ని ఆహారంలో చేర్చుకోవాలని అంటున్నారు నిపుణులు.
gas troble home remedies
ఎందుకంటే కారంలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అల్సర్ ఉన్నవారు ఎక్కువ కారం తినకూడదు అని అంటూ ఉంటారు. అయితే ఇటీవల జరిగిన పరిశోధనల్లో కారంలో ఉండే కొన్ని సమ్మేళనాలు జీర్ణ సమస్యలను తగ్గిస్తాయని తేలింది.
blood thinning
రక్త ప్రసరణ మెరుగు అయ్యి గుండె సమస్యలు రావు. కీళ్ల నొప్పులు,తలనొప్పి ఉన్నవారు కారం తింటే మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాక దగ్గు,జలుబు ఉన్నవారు కారం తింటే తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఎండు మిర‌ప‌కాయ‌ల పొడి (కారం)లో ఉండే అనేక ర‌కాల స‌మ్మేళ‌నాలు ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ రాకుండా కాపాడతాయని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది.
Weight Loss tips in telugu
ఎర్ర మిరపకాయ ఆకలిని తగ్గిస్తుంది. అలాగే శరీరంలోని జీవక్రియ రేటును పెంచడం ద్వారా అదనపు కొవ్వును కరిగిస్తుంది. అధిక మొత్తంలో పొటాషియం ఉండుట వలన రక్త నాళాలను రిలాక్స్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం ఉండుట వలన నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.