Healthhealth tips in telugu

రోజూ అరస్పూన్ ఈ పొడి చాలు.. ఎముకల బలహీనత, కండరాల నొప్పులు మాయం!

Joint Pains Home Remedies : ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యలు ఎముకల బలహీనత, కండరాల నొప్పులు మరియు కాల్షియం లోపం. ఖరీదైన మందులు అవసరం లేకుండా, మీ ఇంట్లోనే తయారు చేసుకునే ఒక అద్భుతమైన ‘అరస్పూన్ పొడి’తో ఈ సమస్యలకు ఎలా చెక్ పెట్టాలో ఈ పోస్ట్‌లో తెలుసుకోండి.

ఈ మధ్య కాలంలో చాలా మంది కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. కాల్షియం లోపం కారణంగా కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు, అలసట, నీరసం,కండరాల నొప్పులు,ఎముకలు బలహీనంగా మారటం వంటి సమస్యలు వస్తాయి. అలాగే 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు చెప్పే పొడిని తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది.
walnut benefits in telugu
ఈ పొడిని తయారుచేసుకోవటానికి ఒక కప్పు అవిసె గింజలు, అరకప్పు తెల్ల నువ్వులు, ఒక కప్పు వాల్ నట్స్ తీసుకొని వేగించి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజు ఉదయం లేదా రాత్రి పడుకోవటానికి అరగంట ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో అరస్పూన్ కలిపి తాగాలి. ఇలా తాగితే అన్నీ రకాల నొప్పులు తగ్గుతాయి.

నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రి సమయంలో తాగితే మంచిది. కీళ్లనొప్పులు,శారీరక బలహీనత వంటి సమస్యలు ఉన్నవారు ఉదయం సమయంలో తాగితే మంచిది. ఉదయం సమయంలో తాగటం వలన అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉంటారు. వయస్సు పెరిగేకొద్ది వచ్చే ఎముకలకు సంబందించి సమస్యలు కూడా ఉండవు.

ఒకప్పుడు నొప్పులు అయినా ఎటువంటి సమస్యలు అయినా 50 ఏళ్ళు దాటాక వచ్చేవి. కానీ ఇప్పటి పరిస్థితిలో 30 ఏళ్ళు వచ్చేసరికి ఏదో ఒక సమస్య వస్తోంది. ఇలా రాకుండా ఉండాలంటే ఇటువంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."