Healthhealth tips in telugu

ఈ 7 ఆహారాలు మీ డైట్‌లో ఉంటే.. డయాబెటిస్‌కు జీవితకాలం గుడ్‌బై చెప్పొచ్చు!

Diabetes herbal remedies : ప్రస్తుత రోజుల్లో డయాబెటిస్ (మధుమేహం) అనేది వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య. కానీ, మన రోజువారీ డైట్‌లో ఈ ‘7 అద్భుతమైన ఆహారాలను’ చేర్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను పూర్తిగా అదుపులో ఉంచవచ్చు. షుగర్ వ్యాధికి జీవితకాలం దూరంగా ఉండాలంటే ఈ సూపర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడే తెలుసుకోండి!

డయాబెటిస్ వచ్చిందంటే జీవిత కాలం మందులు వాడవలసిందే. అలాగే తీసుకొనే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం కూడా డయాబెటిస్ ఉన్నవారిలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఆహారాలను తీసుకుంటే మంచిది. ఆ ఆహారాలను గురించి తెలుసుకుందాం.

దాల్చినచెక్క డయాబెటిస్ ఉన్నవారికి ఒక వరం అని చెప్పవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆక్సీకరణ ఒత్తిడి ప్రమాదాన్ని తగ్గించడానికి దాల్చినచెక్క సహాయపడుతుంది. ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు దాల్చినచెక్క పొడి వేసి బాగా కలిపి తాగాలి. ఉదయం టిఫిన్ చేసినప్పుడు టిఫిన్ మీద దాల్చినచెక్క పొడి జల్లుకొని తినవచ్చు.
curry leaves
కరివేపాకు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఉదయం సమయంలో 5 కరివేపాకు ఆకులను నమిలి మింగవచ్చు. లేదా కషాయం చేసుకొని తాగవచ్చు. లేదా కరివేపాకును పొడిగా చేసుకొని అన్నంలో మొదటి ముద్దగా తినవచ్చు. కరివేపాకును ఏ రూపంలో తీసుకున్న మంచి ఫలితం వస్తుంది.

మెంతులు డయాబెటిస్ నిర్వహణలో చాలా బాగా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటానికి మరియు గ్లూకోజ్ఆధారిత ఇన్సులిన్ స్రావాన్ని ప్రేరేపించడానికి సహాయపడుతుంది. రాత్రి సమయంలో అరస్పూన్ మెంతులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను నములుతూ ఆ నీటిని తాగాలి.

అల్లంలో ఉన్న లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించటానికి మరియు ఇన్సులిన్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు ఉదయం పరగడుపున అంగుళం అల్లం ముక్కను కషాయంగా చేసుకొని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది.

డుతుంది. దీనిలో చక్కెర స్థాయిలను తగ్గించగల హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉండుట వలన చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సీజన్ లో దొరికినప్పుడు అసలు మిస్ కాకుండా తినటం అలవాటు చేసుకోవాలి. నేరేడు జ్యూస్ సంవత్సరం మొత్తం మార్కెట్ లో లభ్యం అవుతుంది.

కాకరకాయలో సెరోటోనిన్ మరియు మోమాటిసిన్ అనే రెండు ముఖ్యమైన సమ్మేళనాలు ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. కాకరకాయ రసాన్ని ఉదయం సమయంలో తాగితే మంచిది.

వేప ఆకులో ఫ్లేవనాయిడ్లు, ట్రైటెర్పెనాయిడ్స్, యాంటీవైరల్ సమ్మేళనాలు మరియు గ్లైకోసైడ్ లు సమృద్దిగా ఉండుట వలన డయాబెటిస్ నిర్వహణలో చాలా బాగా సహాయపడుతుంది. ఉదయం రెండు వేప ఆకులను నమిలి మింగవచ్చు. లేదా వేప కాషాయన్ని చేసుకొని తాగవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."