Joint Pains:ఇలా చేస్తే చాలు శరీరంలో ఉన్న నొప్పులు అన్నీమాయం…జీవితంలో అసలు ఉండవు
Joint Pains Home Remedies in telugu: ఈ మధ్య కాలంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి అనేవి వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి. నొప్పులు ప్రారంభంలో ఉన్నప్పుడూ ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ ఇప్పుడు చెప్పే చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కలబంద జ్యూస్, కోడిగుడ్డు తెల్లసొన వేసి బాగా కలిపి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజుల పాటు చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. కలబందలో ఉన్న లక్షణాలు నొప్పులను తగ్గిస్తాయి.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం, అరస్పూన్ తేనె కలిపి ఉదయం సమయంలో తాగాలి. ఇలా తాగటం వలన కీళ్ల నొప్పులు,కీళ్ల వాపులు, అధిక బరువు సమస్య నుండి బయట పడతారు. కొబ్బరి నూనెలో కర్పూరం వేసి వేడి చేసి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాయాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

