Healthhealth tips in telugu

1 లడ్డు – ఎముకలను బలంగా ఆరోగ్యంగా ఉంచి కీళ్లనొప్పులు లేకుండా కీళ్ల మధ్య జిగురును పెంచుతుంది

Ragi Walnut Laddu : ఈ రోజుల్లో సమస్యలు అయితే చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా Calcium లోపం అనేది ఎక్కువగా కనపడుతుంది. ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే లడ్డు రోజుకి ఒకటి తింటే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. ముఖ్యంగా ఈ వేసవిలో వచ్చే అలసట,నీరసం వంటివి ఏమి ఉండవు.
walnut benefits in telugu
పొయ్యి మీద పాన్ పెట్టి దానిలో ఒక కప్పు రాగి పిండి వేసి వేగించి ఒక బౌల్ లో పోయాలి. ఆ తర్వాత అరకప్పు వాల్ నట్స్ వేగించి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ లో ఖర్జూరం మెత్తగా చేసి వేయాలి. దానిలోనే తేనె వేసి బాగా కలపాలి. తేనెలో ఖర్జూరం కాస్త ఉడికాక, ఒక స్పూన్ సొంపు పొడి, యాలకుల పొడి వేసుకొని బాగా కలపాలి.
Is Ragi Good for Diabetes
ఆ తర్వాత వేగించి ఉంచుకున్న రాగి పిండి, వాల్ నట్స్ పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం బాగా కలిశాక కాస్త వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న లడ్డూల మాదిరిగా చేసుకోవాలి. ప్రతి రోజు ఒక లడ్డు తింటే Calcium లోపం ఉండదు. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,నడుము నొప్పి వంటివి అన్నీ తగ్గుతాయి. కీళ్ల మధ్య జిగురు కూడా పెరుగుతుంది.
Honey
వయస్సు పెరిగే కొద్ది వచ్చే సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ లడ్డును చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ తినవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.