Healthhealth tips in telugu

కేవలం 2 నిమిషాల్లో పిప్పి పన్ను నొప్పి మాయం.. ఇక జీవితంలో ఆ బాధే ఉండదు!

pippi pannu Home remedies : పిప్పి పన్ను సమస్య ఉన్నప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది. అలాగే చిగురు వాపు వంటివి కూడా వస్తాయి. ఈ సమస్యలు ఉన్నప్పుడు ఆహారం తినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సమస్యల పరిష్కారానికి ఇంగ్లీష్ మందులు వాడుతున్న ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి.

దీని కోసం ఆరు లవంగాలు, 4 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసి మెత్తగా చేసుకోవాలి. ఇక ఆ తర్వాత పొయ్యి మీద చిన్న పాన్ పెట్టి దానిలో దాదాపుగా 5 స్పూన్ల ఆముదం వేసి ఆ తర్వాత లవంగాలు,వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి మరిగించాలి.

కాస్త చల్లారాక సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెలో కాటన్ డిప్ చేసి పిప్పి పన్ను మీద పెట్టి పావుగంట ఉంచుకోవాలి.

☛ Also Read: చేతులకు వెల్లుల్లి వాసన వస్తుంటే.. వెంటనే ఈ టిప్స్ ట్రై చేయండి!

ఇలా రోజులో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. అలాగే నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ నూనెను రాసి సున్నితంగా మసాజ్ చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

☛ Also Read: కర్పూరంలో ఏ వస్తువు కలిపి వెలిగిస్తే.. అదృష్టం మీ తలుపు తడుతుందో తెలుసా?

ఉదయం బ్రష్ చేయటానికి అరగంట ముందు ఈ నూనెలో కాటన్ ముంచి పిప్పి పన్ను ఉన్న ప్రదేశంలో పెట్టాలి. అరగంట అయ్యాక బ్రష్ చేస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

☛ Also Read: కళ్ళజోడుకు గుడ్ బై: కంటి చూపును సహజంగా పెంచే అద్భుత చిట్కాలు!

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."