Healthhealth tips in telugu

ఇలా చేస్తే చేతి,కాలి గోళ్లపై ఏర్పడిన ఫంగస్,గోరు చుట్టుని,పుచ్చు గోళ్ళని మాయం చేస్తుంది

Fungal Nail Infection : సాదరణంగా మనలో చాలా మందికి చేతి,కాలి గోర్లపై ఫంగల్ ఇన్ ఫెక్షన్ వస్తుంది. ఈ సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడూ ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు అసలు అశ్రద్ద చేయకూడదు. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
garlic
ఒక బౌల్ లో ఒక స్పూన్ మెంతి పొడి, ఒక స్పూన్ ఆలోవెరా జెల్, 3 వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి మెత్తని పేస్ట్ గా చేసి వేసి అవసరం అయితే నీటిని కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి చేయాలి.

ఈ విధంగా సమస్య తగ్గేవరకు చేయాలి. ఈ విధంగా చేయటం వలన చేతి,కాలి గోళ్లపై ఏర్పడిన ఫంగస్,గోరు చుట్టు,పుచ్చు గోళ్ళ సమస్య అన్నీ తొలగిపోతాయి. కాస్త శ్రద్ద సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు వాపు,నొప్పిని తగ్గించటానికి సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.