ఈ గింజలను నానబెట్టి తింటే వేసవిలో వచ్చే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు
Three soaked seeds Benefits : వేసవిలో ఆరోగ్యం పట్ల కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టవలసిన అవసరం ఉంది. వేసవిలో చాలా తొందరగా అలసట వస్తుంది. అందువల్ల కొన్ని ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటే నీరసం,అలసట లేకుండా హుషారుగా ఉంటారు. ఇప్పుడు చెప్పే ఆహారాలను తీసుకుంటే వేసవిలో వచ్చే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

మన వంటింటిలో రెగ్యులర్ గా వాడే మెంతులను అరస్పూన్ రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి. ఈ విధంగా చేయటం వలన శరీరంలో వేడి తగ్గుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. కిడ్నీ సమస్యలు ఉండవు.కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
రాత్రి సమయంలో ఒక స్పూన్ ఆవిసే గింజలను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన ఆవిసే గింజలను తింటూ ఆ నీటిని తాగాలి. ఈ విధంగా చేయటం వలన నీరసం,అలసట,నిస్సత్తువ తగ్గటమే కాకుండా అధిక బరువు సమస్య తగ్గుతుంది. వేసవిలో వచ్చే జీర్ణ సంబంద సమస్యలు కూడా ఉండవు. చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది.
మాసాలా దినుసుగా ఉపయోగించే గసగసాలను అరస్పూన్ మోతాదులో రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటమే కాకుండా ఎముకలు,కండరాలు బలంగా ఉంటాయి. నిద్రలేమి సమస్య ఉన్నవారికి ఒక మంచి మందుగా చెప్పవచ్చు. అయితే గసగసాలను ఎక్కువ మొత్తంలో వాడకూడదు. లిమిట్ గానే వాడాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

