Healthhealth tips in telugu

అరస్పూన్ తింటే చాలు పుల్లటి త్రేన్పులు,గ్యాస్ తగ్గటమే కాకుండా జీర్ణ సమస్యలు కూడా ఉండవు

Instant Relief for Gas Pain : ఎక్కువగా మసాలా పదార్ధాలను తీసుకోవటం, ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవటం వంటి అనేక కారణాలతో గ్యాస్,పుల్లటి త్రేన్పులు వస్తూ ఉంటాయి. తీసుకున్న ఆహారం జీర్ణం సరిగా కానప్పుడు ఇటువంటి సమస్యలు వస్తాయి. చాలా మంది ఇలా సమస్యలు రాగానే మందులు వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు.
sompu
సొంపు గింజలు కడుపులో మంట, గ్యాస్,కడుపు ఉబ్బరం, పుల్లటి త్రేన్పులను తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సొంపు గింజలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. సొంపులో ఉండే యాంటీ అల్సర్ లక్షణాలు ఈ సమస్యలకు తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. భోజనం చేసిన వెంటనే అరస్పూన్ సొంపు తినవచ్చు.

ఇలా తినటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు. సొంపు గింజలను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి రుచి కోసం కొంచెం తేనె కలిపి తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ విధంగా రోజులో మూడు సార్లు చేయవచ్చు.

గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం, పుల్లటి త్రేన్పులు అనేవి తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే వస్తాయి. కాబట్టి జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చూసుకోవాలి. తీసుకొనే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.