Healthhealth tips in telugu

వారంలో 2 సార్లు తింటే కంటి చూపు పెరగటమే కాకుండా కంటి నరాలు బలంగా ఉంటాయి

Palak Khandvi : కంటికి సంబందించిన సమస్యలు లేకుండా కంటి చూపు బాగుండేలా ఉండటానికి ఇప్పుడు చెప్పే Palak Khandvi చాలా బాగా సహాయపడుతుంది . కంటికి ఎటువంటి సమస్యలు ఉండవు. దీనిని వారంలో రెండు సార్లు చేసుకొని తింటే మంచిది. Calcium సమృద్దిగా ఉండుట వలన ఎముకలు కూడా బలంగా ఉంటాయి.

పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ లో కట్ చేసిన కప్పున్నర పాలకూర,కరివేపాకు, ఒక స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు,ఒక కప్పు పెరుగు వేసి మెత్తగా మిక్సీ చేయాలి. ఈ మిశ్రమంలో 2 స్పూన్ల బొంబాయి రవ్వ, 2 స్పూన్ల మల్టీ గ్రైన్ పిండి వేసి మరొక సారి మిక్సీ చేయాలి.

ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి పైన వచ్చిన పిప్పిని తీసేయాలి. పాలక్ పేస్ట్ లో 5 ఎండుమిరప ముక్కలు,కొత్తిమీర, 1 స్పూన్ నిమ్మరసం, అరస్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పళ్ళెంలో పోసి డబుల్ బాయిలింగ్ పద్దతిలో 15 నిమిషాల పాటు ఉడికించాలి. బాగా ఉడికాక ముక్కలుగా కట్ చేసి రోల్స్ కింద చుట్టాలి.

పొయ్యి మీద పాన్ పెట్టి మీగడ వేసి కొంచెం వేడి అయ్యాక 1 స్పూన ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర,1 స్పూన్ వెగించిన నువ్వులు వేసి బాగా వేగించాలి. వేగిన ఈ మిశ్రమాన్ని పైన తయారుచేసుకున్న రోల్స్ పైన వేయాలి. ఈ విధంగా తయారుచేసుకొని తింటే మంచి రుచిగా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.