Healthhealth tips in telugu

ఈ ఆకు రోజూ తింటే నరాల బలహీనత, షుగర్ వ్యాధి పరార్!

Arugula leaves benefits : మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా నేటి కాలంలో నరాల బలహీనత, డయాబెటిస్ వంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. అయితే, ప్రకృతి మనకు ప్రసాదించిన ఓ అద్భుతమైన ఆకుతో ఈ అనారోగ్య సమస్యలన్నింటికీ సులువుగా చెక్ పెట్టవచ్చు.

నరాల్లో రక్త ప్రసరణను మెరుగుపరిచి, భవిష్యత్తులో పక్షవాతం వంటివి రాకుండా అడ్డుకోవడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే ఆ దివ్యౌషధం లాంటి ఆకు ఏంటి? దానిని ఎలా వాడాలి? అన్న పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ డయాబెటిస్ నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. అప్పుడే వేసుకొనే మందుల మోతాదు పెరగకుండా ఉంటుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉండటానికి అరుగులా ఆకు (arugula leaves) చాలా బాగా సహాయపడుతుంది.
Diabetes In Telugu
ఆవాలు కుటుంబానికి చెందిన ఈ ఆకు మంచి సువాసనతో ఉంటుంది. అరుగులా ఆకుల్లో విటమిన్లు ఏ,కె, బీ9, సి, ఐర‌న్, మెగ్నీషియం, అయోడిన్, కాల్షియం మరియు పొటాషియం ఉంటుంది. విటమిన్ K గ్లూకోజ్ జీవక్రియ మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. అలాగే ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్, కూడా సమృద్దిగా ఉండుట వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.

ఇది ఇన్సులిన్ సెన్సిటివిటిని తగ్గిస్తుంది. అలాగే ఈ ఆకులలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉండుట వలన సాదరణంగా డయాబెటిస్ రోగులలో ఉండే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.అలాగే కణాలలోకి గ్లూకోజ్ రవాణాను మెరుగుపరుస్తుంది. మంచి కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు డయాబెటిస్ కారణంగా వచ్చే న్యూరోపతిక్ సమస్యలను నివారిస్తుంది.

ఈ ఆకులను నేరుగా తినవచ్చు. లేదా జ్యూస్ గా తయారుచేసుకొని తాగవచ్చు. అంతేకాకుండా ఈ ఆకులను సలాడ్ వంటి వాటిలో వేసుకొని కూడా తీసుకోవచ్చు. ఈ ఆకులను తీసుకొనే ముందు ఒక్కసారి ఆయుర్వేద వైధ్య నిపుణుని సలహా తీసుకోవటం మంచిది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడూ తీసుకొనే మోతాదు కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.

ఈ ఆకును పుదీనా వాడినట్టు వాడితే సరిపోతుంది. ఈ ఆకు మెదడులోను,గుండెలోను రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. రక్తనాళాల్లో అడ్డంకులు ఏమి లేకుండా చేసి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి గుండెకు,మెదడుకు ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ఈ మొక్కను ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. దీని విత్తనాలు మార్కెట్ లో దొరుకుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."