Healthhealth tips in telugu

ఈ పచ్చడి తింటే ఇమ్యూనిటి పెరగటమే కాకుండా అరుగుదల సమస్యలు ఉండవు

Bendakaya perugu pachadi : పెరుగుతో చేసిన పచ్చడి తింటే ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ది చెంది జీర్ణ సమస్యలు,అరుగుదల సమస్యలు లేకుండా చేయటమే కాకుండా ఇమ్యూనిటి కూడా పెరుగుతుంది. బెండకాయతో పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. పావు కేజీ బెండకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
Bendakaya Benefits In telugu
ముందుగా మిక్సీలో అరకప్పు వేయించిన వేరుశనగ గింజలు, అరకప్పు పచ్చి కొబ్బరి తురుము,రెండు స్పూన్ల అల్లం తురుము, రెండు స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలు,అరకప్పు కొత్తిమీర వేసి ముక్కా చెక్కాలా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసి బెండకాయ ముక్కలను 5 నిమిషాలు వేగించి ఆ తర్వాత ఒక కప్పు పుల్ల మజ్జిగ వేసి ఉడికించుకోవాలి.

బెండకాయ ముక్కలు ఉడికి పొడి పొడిగా మారాక వేరుశనగ మిశ్రమం, ఒక కప్పు పెరుగు, పావు స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఇక తాలింపు పెట్టాలి. పొయ్యి మీద పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసి 3 ఎండుమిర్చి, ఒక స్పూన్ ఆవాలు,ఒక స్పూన్ జీలకర్ర,కొంచెం కరివేపాకు,చిటికెడు ఇంగువ వేసి బాగా కలిపి బెండకాయ పచ్చడిలో కలపాలి.

ఎంతో రుచికరమైన బెండకాయ పెరుగు పచ్చడి రెడీ. ఈ పచ్చడిని వారంలో రెండు సార్లు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అరుగుదల సమస్యలు ఉన్న వారికి ఇది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ది చెందుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.