Healthhealth tips in telugu

రోజుకి 1 సారి నరాల్లో తిమ్మిర్లు,నరాల బలహీనత,రక్త నాళాల్లో బ్లాక్స్,తల తిరగటం వంటివి ఉండవు

Body weakness home remedies : ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వాటిలో ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో ఎక్కువగా నరాల్లో తిమ్మిర్లు,నరాల బలహీనత,రక్త నాళాల్లో అడ్డంకులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. డయాబెటిస్ లేనివారిలో కూడా ఈ సమస్యలు ఉంటున్నాయి. దీనికి ఒక మంచి ఇంటి చిట్కా ఉంది.
Weight Loss Drink In Telugu Dalchina Chekka
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి అంగుళం దాల్చినచెక్క, ఒక నల్ల యాలక్కాయ, మూడు లవంగాలు వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. మరిగిన ఈ నీటిని గ్లాసులోకి వడకట్టి ఉదయం సమయంలో తీసుకోవాలి. ఈ విధంగా రోజు తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం వస్తుంది.

నల్ల యాలకుల్లో ఉన్న లక్షణాలు నరాల్లో అడ్డంకులను తొలగించి రక్త ప్రవాహాన్ని సక్రమంగా జరిగేలా చేస్తుంది. నల్ల యాలకులు ఆయుర్వేదం షాప్ లో అమ్ముతారు. మనం సాదరణంగా ఆకుపచ్చగా ఉన్న యాలకులను వాడుతూ ఉంటాం. లివర్ సమస్యలకు కూడా బాగా సహాయపడుతుంది. లవంగాలు డయాబెటిస్ ఉన్నవారికి బాగా హెల్ప్ చేస్తుంది.

దాల్చినచెక్కలో ఉన్న పోషకాలు నరాల్లో నొప్పులను తగ్గించటానికి సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. నరాలకు సంబందించిన సమస్యలు ఉన్నప్పుడూ అసలు అశ్రద్ద చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి. అలా డాక్టర్ సూచనలు పాటిస్తూ ఇలా ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ఫలితం తొందరగా వస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.