Beauty TipsHealthhealth tips in telugu

ఖరీదైన ఆయిల్స్ వద్దు.. ఇంట్లోనే మందారంతో ఈ నూనె కాచుకుంటే జుట్టు రాలనే రాలదు!

Hair Fall Tips In telugu : తలస్నానం చేసినా, జుట్టు దువ్వుకున్నా చేతికి గుప్పెడు జుట్టు ఊడి వస్తుంటే.. ఆ టెన్షన్ అంతా ఇంతా కాదు కదా! హెయిర్ ఫాల్ ఆపడానికి ఎన్నో షాంపూలు, ఖరీదైన నూనెలు మార్చి మార్చి విసిగిపోయారా? అయితే ఇక అస్సలు బాధపడకండి. మన పెరట్లో సహజంగా దొరికే ‘మందారం’ జుట్టు రాలడాన్ని అరికట్టడంలో ఒక సంజీవనిలా పనిచేస్తుంది.

అయితే, కేవలం మందారమే కాకుండా దానికి ‘ఈ ఒక్క పదార్థం’ కలిపి రాస్తే రిజల్ట్ పదింతలు ఎక్కువగా ఉంటుంది. జుట్టు ఊడటం పూర్తిగా ఆగిపోయి, మీ కురులు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరగడానికి నేను చెప్పే ఈ సింపుల్ చిట్కాను ఎలా తయారు చేయాలో ఈ ఆర్టికల్‌లో చూద్దాం రండి!

జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలా మంది కంగారు పడి మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల షాంపూలు,నూనెలను వాడుతూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో సులభంగా దొరికే సహజసిద్దమైన పదార్ధాలను ఉపయోగించి చాలా సులభంగా ఈ సమస్య నుండి బయట పడవచ్చు.
Hibiscus tree benefits In telugu
మూడు స్పూన్ల బియ్యాన్ని కడిగి నీటిని పోసి ఉడికించి ఆ నీటిని వడకట్టాలి. ఆ తర్వాత 4 మందార పువ్వులను రేకలుగా విడతీయాలి. 4 మందార ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మందార పువ్వులు దొరక్కపోతే మందార మొగ్గలను వాడవచ్చు. మందార పువ్వు రేకలను,ఆకులను కచ్చా పచ్చాగా దంచాలి.

ఒక సీసాలో గోరువెచ్చగా ఉన్న బియ్యం నీటిని పోయాలి. ఆ తర్వాత మందార మిశ్రమాన్ని వేసి బాగా కలిపి రెండు గంటలు అలా వదిలేయలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక సాదరణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. మరుసటి రోజు జుట్టుకి నూనెను రాసి మసాజ్ చేయాలి.

ఆ తర్వాత కుంకుడు కాయలు లేదా రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. మందార ఆకులు,పువ్వులు దాదాపుగా అందరికీ అందుబాటులో ఉంటాయి. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఎర్ర మందార పువ్వులను మాత్రమే ఉపయోగించాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."