Healthhealth tips in telugu

బ్రెయిన్ పవర్ పెంచే ‘కంద గడ్డ’.. దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు!

Health benefits of kanda : కూరగాయల మార్కెట్లో తరచుగా కనిపించే ‘కంద’ (Elephant Foot Yam) దుంపను చూసి చాలామందికి ఇష్టం ఉండదు. కోస్తే దురద వస్తుందనో, లేదా రుచిగా ఉండదనో దీనికి దూరంగా ఉంటారు. కానీ, చూసేందుకు గరుకుగా ఉండే ఈ దుంపలో మన శరీరానికి అవసరమైన ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు దాగున్నాయని మీకు తెలుసా?

ముఖ్యంగా ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో చాలామందిని వేధిస్తున్న ‘మతిమరుపు’ను అరికట్టడంలో, మెదడు చురుకుదనాన్ని పెంచడంలో కంద అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతకీ ఈ కంద గడ్డలో ఉండే పోషకాలు ఏమిటి? ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటో ఈ పోస్ట్‌లో సవివరంగా తెలుసుకుందాం.

కందలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కందను కోసినప్పుడు చేతులు దురద పెడుతూ ఉంటాయి. అందుకే చాలామంది కందను తినటానికి ఇష్టపడరు. అయితే ఇప్పుడు చెప్పే ప్రయోజనాలు తెలిస్తే ఖచ్చితంగా తినడానికి ప్రయత్నం చేస్తారు. డయాబెటిస్ ఉన్నవారు., అధిక బరువు ఉన్నవారు, గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది

దీనిలో ఉండే విటమిన్స్, ఫైటో న్యుట్రియన్స్ వంటివి ఎటువంటి సమస్యలు లేకుండా కాపాడతాయి. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. అలాగే శరీరంలో .రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇన్ఫెక్షన్స్ తో పోరాటం చేసే సామర్థ్యాన్ని శరీరానికి అందిస్తుంది. విటమిన్ b6 ఉండే ఆహారాలను వారంలో రెండు సార్లు తప్పనిసరిగా తినాలి.

ఇటువంటి ఆహారాలను తీసుకోవడం వలన శరీరంలో ఎర్ర రక్త కణాలు బాగా పెరుగుతాయి. అలాగే మన శరీర చర్మాన్ని రక్షిస్తుంది. కందలో b6 చాలా సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా జీర్ణసంబంధ సమస్యలైన గ్యాస్ట్రిక్., స్టొమక్ అప్సెట్ వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది.

ఒకప్పుడు మతిమరుపు అనేది వృద్ధాప్యంలో వచ్చే సమస్య కానీ ఈ రోజుల్లో 30 నుంచి 40 ఏళ్ల వయసు వచ్చేసరికి రోజులో ఏదో ఒక సమయంలో ఏదో ఒక విషయాన్ని మర్చిపోవడం జరుగుతుంది. ఇలాంటప్పుడు అశ్రద్ధ చేయకుండా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మతిమరుపు అనేది నిదానంగా ప్రారంభమై చివరకు తీవ్రమైన సమస్యగా మారుతుంది. కాబట్టి ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కంద తీసుకుంటే మతిమరుపు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. .

వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. అందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్., మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు జ్ఞాపక శక్తి పెరిగేలా చేస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గితే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి .కనీసం వారానికి ఒకసారి తప్పనిసరిగా కంద తీసుకుని మతిమరుపు నుంచి బయటపడండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."