మెంతులను దీనితో కలిపి తీసుకుంటే నర నరాల నుండి డయాబెటిస్ బయటకు పోతుంది…ఇది నిజం
FenuGreek seeds Diabetes : డయాబెటిస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. దాంతో చాలా కంగారు పడుతున్నారు. అలా కంగారు పడవలసిన అవసరం లేదు. డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.

మెంతులు డయాబెటిస్ నియంత్రణలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తెలిసింది. మెంతులను ప్రతి రోజు అరస్పూన్ మోతాదులో తీసుకోవాలి. మెంతులను పెరుగులో నానబెట్టి తీసుకోవచ్చు. లేదా మెంతులను పొడిగా చేసుకొని నిల్వ చేసుకొని వాడవచ్చు. ఒక గ్లాస్ మజ్జిగలో అరస్పూన్ మెంతి పొడి వేసి బాగా కలిపి తాగవచ్చు.
అలా కాకుండా ఒక గ్లాస్ పాలల్లో అరస్పూన్ మెంతి పొడి వేసి బాగా కలిపి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. మెంతి పొడిని పెరుగు కన్నా పాలల్లో కలిపి తీసుకుంటేనే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. మెంతుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉండుట వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
మెంతుల్లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన పిండి పదార్ధాల శోషణను స్లో చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ నిదానంగా విడుదల అయ్యేలా చేస్తుంది.
మెంతుల్లో ఉండే 4 హైడ్రాక్సిస్ ల్యూసిన్ అనే ఓ రకమైన అమైనో ఆల్కనాయిక్ యాసిడ్ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు శరీరంలోని కణాలు ఇన్సులిన్ స్వీకరించేలా చేస్తుంది. మరోవైపు ఇందులోని సోపోనిన్స్ రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గటానికీ దోహదం చేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

