Healthhealth tips in telugu

బీపీతో బాధపడుతున్నారా? అయితే ఈ మ్యాజిక్ ‘టీ’ ని అస్సలు మిస్ కావద్దు!

High Blood Pressure Remedies : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, పెరిగిన ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల అధిక రక్తపోటు (High Blood Pressure) అనేది చాలా సాధారణ సమస్యగా మారిపోయింది.

బీపీని అదుపులో ఉంచుకోవడానికి రోజూ మందులు వాడటంతో పాటు, మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతో తయారు చేసుకునే ఒక స్పెషల్ ‘టీ’ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతకీ ఆ టీ ఏమిటి? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి? అది బీపీని ఎలా తగ్గిస్తుంది? తదితర పూర్తి వివరాలు ఈ బ్లాగ్ పోస్ట్‌లో తెలుసుకుందాం.

ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. వాటిలో అధిక రక్తపోటు సమస్య అనేది చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా మందులను వాడాలి. ఒక్కసారి బీపీ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడవలసిందే.
Hair fall Tips in telugu
అలా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే “టీ” ని తాగితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. మందార పువ్వులతో టీ తయారు చేసుకొని తాగితే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దాదాపుగా ప్రతి ఇంటిలోనూ మందార చెట్టు ఉంటుంది. కాబట్టి కాస్త ఓపిక చేసుకొని ఈ టీ తయారు చేసుకుంటే సరిపోతుంది. డ్రై మందార పువ్వుల పొడి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది.

కానీ తాజా పువ్వులు అయితే ఎక్కువ శాతం మంచి ఫలితాన్ని పొందవచ్చు. మందార పువ్వుల టీని ఎలా తయారుచేయాలో చూద్దాం. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి రెండు మందార పువ్వుల రేకలను వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన ఈ టీని గ్లాస్ లో పోసి అరచెక్క నిమ్మరసం,ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి.

డయాబెటిస్ నియంత్రణకు కూడా బాగా సహాయపడుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకోవాలి. మందార పువ్వులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ బి1 మరియు ఐరన్, ఫ్లేవనాయిడ్ గ్లైకోసైడ్‌లు సమృద్దిగా ఉంటాయి. ఈ టీని రోజులో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."