రాత్రి పడుకునే ముందు ఈ పాలు తాగడం అస్సలు మర్చిపోకండి.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!
Almond Milk benefits In Telugu : రోజంతా చేసిన పని వల్ల కలిగే అలసట, ఒత్తిడి మాయం అవ్వాలంటే రాత్రి పూట కంటి నిండా నిద్రపోవడం చాలా అవసరం. అయితే, రాత్రి పడుకునే ముందు మనం తీసుకునే కొన్ని పానీయాలు మన ఆరోగ్యంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి.
ముఖ్యంగా నిద్రపోయే ముందు ఒక ప్రత్యేకమైన పాలను తాగడం వల్ల ఎన్నో ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పాలు ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రను ఇవ్వడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇంతకీ ఆ పాలు ఏంటి? వాటిలో ఏమేం కలుపుకుని తాగాలి? అనే విషయాలను ఈ బ్లాగ్లో వివరంగా తెలుసుకుందాం.
సాదరణంగా రాత్రి పడుకొనే ముందు తీసుకొనే ఆహారం మన జీవక్రియలు మరియు రోగ నిరోధకశక్తి మీద ప్రభావం చూపుతుంది. ప్రతి మనిషికి రోజుకి 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. మంచి నిద్ర మరియు మంచి పోషకాలు ఉన్న ఆహారం మన ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఆ రెండింటినీ అసలు విస్మరించకూడదు.

ఇప్పుడు మంచి నిద్ర కోసం,శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం కావటానికి మరియు బరువు తగ్గటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే ఒక డ్రింక్ గురించి తెలుసుకుందాం. బాదం పాలను రాత్రి పడుకోవటానికి ముందు తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఒక మిక్సీ జార్ లో వేగించిన 7 బాదం పప్పులు,ఒక స్పూన్ బెల్లం పొడి లేదా ఒక స్పూన్ తేనె వేసి మెత్తగా చేసుకోవాలి.
ఈ పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి తాగాలి. ఈ విధంగా తాగటం వలన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ E సమృద్దిగా ఉండుట వలన మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేయటమే కాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.
పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా కిడ్నీకి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేసి కిడ్నీల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

