Healthhealth tips in telugu

గొంతు నొప్పి, జలుబు వేధిస్తున్నాయా? ధనియాలతో వీటిని కలిపితే క్షణాల్లో మాయం!

Cold And Cough HOme Remedies : వాతావరణం కొద్దిగా మారగానే ముందుగా మనల్ని పలకరించేవి జలుబు, గొంతు నొప్పి కదా! గొంతులో గరగర, ఏదైనా మింగాలంటే ఇబ్బంది.. అబ్బా ఈ సమస్యలు చాలా చిరాకు తెప్పిస్తాయి.

ప్రతి చిన్నదానికీ మందులు వేసుకోవడం కంటే, మన వంటింట్లో దొరికే వాటితోనే సులువుగా తగ్గించుకుంటే ఎంత బాగుంటుంది? అవును, మన పోపుల పెట్టెలో ఉండే ‘ధనియాలతో’ కొన్ని వస్తువులు కలిపి తీసుకుంటే చాలు.. గొంతు ఇన్ఫెక్షన్, జలుబు ఇట్టే మాయం అయిపోతాయి. అదెలాగో, ఆ సింపుల్ ఇంటి చిట్కా ఏంటో ఈ పోస్ట్‌లో చూసేద్దాం రండి!

దగ్గు, జలుబు, చాతిలో వచ్చే ఇన్ఫెక్షన్, శ్లేష్మం తగ్గటానికి మన ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. వీటిని ప్రారంభ దశలోనే తగ్గించుకోవాలి. లేకపోతే ఇవి మన శరీరంలో అనేక రకాల రుగ్మతలు రావటానికి అవకాశాన్ని కల్పిస్తాయి. గొంతులో ఏ కాస్త తేడా ఉన్నా గడబిడ ఉన్నా చాలా ఇబ్బందిగా ఉండి నీరసించి పోతాం.
Dhaniyalu Health benefits in telugu
ఈ చిట్కా కోసం నాలుగు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఒక స్పూన్ ధనియాలు,పది మిరియాలను కచ్చా పచ్చాగా దంచుకోవాలి. పొయ్యి వెలిగించి గ్లాసున్నర నీటిని పోసి కొంచెం వేడి అయ్యాక ధనియాలు,మిరియాల మిశ్రమాన్ని వేయాలి. ఆ తర్వాత పావుస్పూన్ శొంఠి పొడిని వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత చిన్న పటిక బెల్లం ముక్క వేసి ఒక నిమిషం మరిగించి ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. దగ్గు,జలుబు తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగాలి. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఎటువంటి ఇన్ ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది.

అధిక బరువు సమస్యతో బాధపడేవారికి కూడా ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. శరీరంలో అదనంగా ఉన్నా కొవ్వు కరిగిపోతుంది. కాబట్టి ఈ డ్రింక్ తయారుచేసుకొని ఇప్పుడు చెప్పిన సమస్యల నుండి బయట పడండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."