Healthhealth tips in telugu

ఈ ఒక్క స్పూన్ గింజలతో.. నొప్పులు, డయాబెటిస్, కొలెస్ట్రాల్‌కు శాశ్వతంగా చెక్ పెట్టండి!

chia seeds in telugu : ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నాయి కదూ! దానికి తోడు అధిక బరువు, కీళ్ల నొప్పులతో పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇన్ని సమస్యలకు ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండట్లేదా?

అయితే మన వంటింట్లో దొరికే ఒకే ఒక్క అద్భుతమైన పరిష్కారం గురించి ఈ రోజు మీతో పంచుకోబోతున్నాను. రోజుకు కేవలం ఒక స్పూన్ ఈ గింజలు (seeds) తింటే చాలు..

కొలెస్ట్రాల్ కరగడమే కాకుండా, షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది. నొప్పులు కూడా మాయం అవుతాయి. మరి అంతటి శక్తివంతమైన ఆ గింజలు ఏంటి? వాటిని ఎలా తినాలో ఈ బ్లాగ్ లో వివరంగా చూద్దాం రండి!

చియా విత్తనాలను సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. ఎందుకంటే దీనిలో ఎన్నో పోషకాలు., ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒకప్పుడు వీటిని చాలా తక్కువగా వాడే వారు. అలాగే చాలా తక్కువగా లభించేవి. కానీ ప్రస్తుతం విరివిగా లభించడమే కాకుండా వీటి వాడకం కూడా చాలా ఎక్కువైంది.
chia seeds
Chia seeds లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన తొందరగా ఆకలి వేయకుండా చేయటమే కాకుండా ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. దాంతో బరువు తగ్గటానికి సహాయపడుతుంది.

ప్రోటీన్ సమృద్దిగా ఉండుట వలన మాంసాహారం తిన‌లేని వారికి ఈ విత్త‌నాల ద్వారా ప్రోటీన్ బాగా అందుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

కాల్షియం, ఫాస్ప‌ర‌స్‌, మెగ్నిషియం, ప్రోటీన్లు సమృద్దిగా ఉండుట వలన ఎముకలు బలంగా,ఆరోగ్యంగా ఉండి ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేసి కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పుల వంటి అన్నీ రకాల నొప్పులను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ chia seeds వేసి మూడు గంటలు నానబెడితే ఆ గింజలు ఉబ్బి జెల్లీ మాదిరిగా అవుతాయి. వీటిని నేరుగా తీసుకోవచ్చు. లేదా జ్యూస్‌లు, స‌లాడ్‌లు, మ‌జ్జిగ వంటి ప‌దార్థాల‌తో క‌లిపి తీసుకోవ‌చ్చు. చియా విత్తనాలను నేరుగా తినడం కంటే వీటిని వేరే ఆహార పదార్థాల్లో కలిపి తినడం వలన అధిక ప్రయోజనం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."