డయాబెటిస్ ఉన్నవారు పైనాపిల్ తినొచ్చా? తింటే ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు!
Diabetes eat pineapple : యాబెటిస్ (షుగర్ వ్యాధి) ఉన్నవాళ్లకు పండ్లు తినాలంటేనే కాస్త భయంగా ఉంటుంది. అందులోనూ భలే తీయగా, నోరూరించే ‘పైనాపిల్’ (అనాస పండు) చూస్తే తినాలనిపించినా.. “అమ్మో షుగర్ పెరిగిపోతుందేమో” అని ఆశను చంపుకుని ఆగిపోతుంటారు కదా?
అయితే, నిజంగానే షుగర్ పేషెంట్స్ పైనాపిల్ అస్సలు తినకూడదా? ఒకవేళ తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయా? పైనాపిల్ వల్ల లాభమా, నష్టమా అనే విషయాలను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఆర్టికల్లో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం.
డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. చాలామందికి ఫ్రూట్స్ తింటే మంచిదా కాదా అనే సందేహం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు కొన్ని రకాల పండ్లను తక్కువ .మోతాదులో తీసుకోవచ్చు.

ఇక ఇప్పుడు డయాబెటిస్ ఉన్నవారు పైనాపిల్ తింటే ఏం జరుగుతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. పైనాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఎంజైమ్స్,ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉండవటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే కడుపులో మంట ఏమైనా ఉంటే తగ్గిస్తుంది.
డయాబెటిస్ ఉన్నవారు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. పైనాపిల్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ 51 నుంచి 73 మధ్యలో ఉంటుంది. పైనాపిల్ తినడం వల్ల డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే కాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరులో కూడా తేడాలు వస్తాయి. వీటి కారణంగా కిడ్నీలు, గుండె వంటి వాటిపై ప్రభావం పడుతుంది.
పైనాపిల్ ని తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. అంటే 100 గ్రాముల కంటే ఎక్కువగా తినకూడదు ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. పైనాపిల్‌లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. అలాగే చక్కెర శోషణ నిదానంగా జరుగుతుంది.
ప్రేగు కదలికలు మెరుగ్గా మారుతాయి. కొలెస్ట్రాల్‌ని తగ్గించి బరువుని కంట్రోల్ చేస్తాయి. దీనిలో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన ఈ సీజన్ లో వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఏదైనా లిమిట్ గా తింటేనే ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

