Healthhealth tips in telugu

రోజుకు 1 గ్లాస్ తాగితే చాలు.. వేలాడే పొట్ట, నడుము కొవ్వు మైనంలా కరగాల్సిందే!

Flax Seeds Weight Loss Drink : ఈ రోజుల్లో మారిన జీవనశైలి, గంటల తరబడి కూర్చుని పనిచేయడం, ఫాస్ట్ ఫుడ్స్ వల్ల బరువు పెరగడం అనేది చాలా సాధారణం అయిపోయింది. ముఖ్యంగా పొట్ట, నడుము, తొడల భాగాల్లో పేరుకుపోయిన మొండి కొవ్వును (Stubborn Fat) కరిగించడం చాలా కష్టమైన పని.

జిమ్‌లకు వెళ్లడానికి సమయం లేక, కఠినమైన డైటింగ్ చేయలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకోసమే ఈ అద్భుతమైన న్యాచురల్ రెమెడీ! రోజూ ఇంట్లోనే తయారు చేసుకునే ఈ ఒక్క గ్లాస్ డ్రింక్ తాగితే చాలు.. ఎంతటి వేలాడే పొట్ట అయినా, నడుము చుట్టూ ఉండే కొవ్వు అయినా సరే ఇట్టే మైనంలా కరిగిపోవాల్సిందే.

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మన వంటగదిలో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే ఈ ఫ్యాట్ బర్నర్ డ్రింక్‌ను ఎలా తయారు చేసుకోవాలో, ఏ సమయంలో తాగాలో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

ఈ రోజుల్లో మనలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే బరువు కచ్చితంగా తగ్గాలి. బరువు తగ్గాలంటే మంచి పోషకాహారం తీసుకుంటూ రోజులో అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కాని పాటిస్తే చాలా సులభంగా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.

దీనికోసం మనం ఒక పౌడర్ తయారు చేసుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టి ఒక కప్పు అవిసె గింజలు వేసి వేగించాలి. ఆ తర్వాత ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ మెంతులను వేసి వేగించాలి. ఒక మిక్సీ జార్ లో వెగించిన అవిసె గింజలు, మెంతులు, వాము, ఒక స్పూను సైంధవ లవణం వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి.

ఈ పొడి దాదాపుగా 15 రోజులు పాటు నిల్వ ఉంటుంది. గాలి చొరబడని సీసాలో నిలువ చేసుకుంటే సరిపోతుంది. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి నీరు కాస్త వేడెక్కాక అర స్పూన్ పొడి వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడగట్టి టీ తాగినట్టుగా కొంచెం కొంచెంగా తాగాలి. .

ఈ విధంగా ప్రతిరోజు తాగుతూ ఉంటే 15 రోజుల్లో తేడా కచ్చితంగా కనబడుతుంది. బరువు అనేది ఆరోగ్యకరమైన రీతిలోనే తగ్గాలి. ఒక్కసారిగా బరువు పెరగకూడదు…అలాగే తగ్గిపోకూడదు. అవిసె గింజలలో ఉండే లక్షణాలు జీవక్రియ రేటును పెంచి బరువు తగ్గించడంలో సహాయపడతాయి

వాము శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా జీర్ణ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. బరువు తగ్గించడంలో జీర్ణ ప్రక్రియ కూడా ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది.

అలాగే మెంతులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగించడమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తాయి. గ్యాస్., ఎసిడిటీ వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తాయి. ఇప్పుడు చెప్పిన ఈ పొడి డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.

అధిక బరువు, డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు ఈ పొడిని తీసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. అయితే ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తించుకోవాలి. ప్రతిరోజు కనీసం అరగంట వ్యాయామం చేస్తేనే ఫలితాలు అనేవి చాలా తొందరగా వస్తాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."