రాత్రి నిద్రపోయే ముందు ఈ ఒక్క గ్లాస్ డ్రింక్ తాగితే.. గ్యాస్, మలబద్ధకం పరార్!
Constipation Home Remedies in telugu : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, సమయం లేక జంక్ ఫుడ్ తినడం, మారిన జీవనశైలి వల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నాయి. ఈ సమస్యల వల్ల రోజంతా అసౌకర్యంగా ఉంటూ, ఏ పనీ సరిగ్గా చేయలేకపోతున్నారా? అయితే ఈ అద్భుతమైన ఇంటి చిట్కా మీకోసమే!
రాత్రి నిద్రపోయే ముందు కేవలం ఒక గ్లాస్ ఈ న్యాచురల్ డ్రింక్ తాగితే చాలు.. మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడి, ఉదయానికి మీ పొట్ట పూర్తిగా శుభ్రపడుతుంది. ఎలాంటి ఖరీదైన మందులు వాడకుండా, మన వంటగదిలో దొరికే సహజమైన వస్తువులతోనే ఈ జీర్ణ సమస్యలకు శాశ్వతంగా ఎలా చెక్ పెట్టొచ్చో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.
ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారాలను తీసుకోకపోవడం, కొన్ని రకాల మందులను వాడటం, రోజుల్లో తగినంత నీటిని తాగక పోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో ఈ మలబద్ధకం సమస్య అనేది చాలా తీవ్రంగా వేధిస్తోంది.

ఈ సమస్య పరిష్కారానికి మన ఇంటిలో దొరికే కొన్ని వస్తువులతో టీ తయారు చేసుకుని రాత్రి పడుకోవడానికి ముందు తాగితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. మిక్సీ జార్ లో ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ సోంపు, అంగుళం దాల్చిన చెక్క ముక్క లేదా పావు స్పూను దాల్చిన చెక్క పొడి వేసుకుని మెత్తని పొడిగా మిక్సీ చేసుకోవాలి.
ఈ పొడిని ఎక్కువ మోతాదులో తయారు చేసుకుని నిల్వ కూడా చేసుకోవచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడెక్కాక పైన తయారు చేసుకున్న పొడి వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టే రుచికి పటిక బెల్లం పొడి కలుపుకొని తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు పట్టిక బెల్లం పొడి లేకుండా తీసుకోవాలి. .
ప్రతిరోజు రాత్రి పడుకోవటానికి ముందు ఒక గ్లాసు ఈ డ్రింక్ తాగితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి మలబద్ధకం సమస్య క్రమంగా తగ్గిపోతుంది. అంతే కాకుండా గ్యాస్., ఎసిడిటీ, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి అన్ని రకాల జీర్ణ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణసంబంధ సమస్యలు ఏమైనా ఉంటే అది మన ఆరోగ్యం మీద తీవ్రంగా ప్రభావం చూపుతుంది.
కాబట్టి సమస్య చిన్నగా ఉన్నప్పుడే మనం పరిష్కారం వైపు అడుగులు వేయాలి. ఇలా ఇంటి చిట్కాలను పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జీర్ణ సంబంద సమస్యల నుండి బయట పడవచ్చు. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయితే ఎటువంటి సమస్యలు ఉండవు. కాబట్టి ఈ చిట్కాను ట్రై చేయండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

