Healthhealth tips in telugu

రోజు 1 కప్పు తాగితే శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గి న‌డుము నాజూగ్గా మారుతుంది

Weight loss Drink : ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్య అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. సరైన వేళకు ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఎక్కువసేపు కూర్చొని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

జీవనశైలిలో మార్పులు, తీసుకునే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే బరువు తగ్గుతారు. ప్రతిరోజు ఒక కప్పు తాగితే 15 రోజుల్లోనే తేడా గమనించవచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. ఆ తర్వాత ఏడు మిరియాలను కచ్చాపచ్చాగా దంచి వేయాలి. .
Ginger benefits in telugu
ఆ తర్వాత అర స్పూన్ సోంపు వేయాలి. ఆ తర్వాత అంగుళం అల్లం ముక్కను దంచి వేయాలి. ఆ తర్వాత చిటికెడు జాజికాయ పొడి, చిటికెడు నల్ల ఉప్పు వేసి నాలుగు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత అర స్పూన్ పసుపు., ఒక స్పూన్ బెల్లం పొడి వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. డయాబెటిస్ ఉన్నవారు బెల్లం వేసుకోకూడదు.
nutmeg
ఈ డ్రింక్ ను వడకట్టి. బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ లేదా డిన్నర్ కు గంట ముందు తీసుకోవాలి. రోజుకి ఒక కప్పు తీసుకుంటూ ఉంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు. ఎప్పుడైనా బరువును ఆరోగ్యకరమైన రీతిలో తగ్గాలి. ఒక్కసారిగా తగ్గిపోకూడదు.
weight loss tips in telugu
ఈ డ్రింక్ లో తీసుకున్న అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు జీరంక్రియ రేటును పెంచి తీసుకున్న ఆహారం కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తాయి. బరువు తగ్గాలంటే జీర్ణప్రక్రియ బాగా సాగాలి. ఈ డ్రింక్ తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. కాస్త ఓపికగా చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."