Healthhealth tips in telugu

బరువు తగ్గాలన్నా, షుగర్ కంట్రోల్ లో ఉండాలన్నా.. గోధుమల కంటే బక్వీట్ (Buckwheat) మిన్న!

Buckwheat benefits In Telugu : రోజూ చపాతీలు, రొట్టెల కోసం గోధుమ పిండినే వాడుతున్నారా? అయితే గోధుమలకు బదులుగా ‘బక్వీట్’ (Buckwheat) వాడి చూడండి. గ్లూటెన్ (Gluten-free) ఏమాత్రం లేని ఈ గింజలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.

బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి ఇది ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉండే బక్వీట్‌ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అసలు బక్వీట్ అంటే ఏమిటి? గోధుమల కంటే ఇది ఎందుకు అంత మేలైనదో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.

Buckwheat పిండి గురించి మనలో చాలా మందికి తెలియదు. మంచి రుచి కలిగిన ఈ పిండి ఒక పండ్ల విత్తనం నుండి తయారవుతుంది. సాధారణ గోధుమ పిండికి జిగురు లేని ప్రత్యామ్నాయమే ఈ పిండి. Buckwheat పిండి సూపర్ మార్కెట్ లో లభ్యం అవుతుంది.
BuckWheat
Buckwheat పిండిని కుట్టు పిండి అని పిలుస్తారు. గోధుమపిండికి ప్రత్యామ్నాయంగా వాడతారు. ఈ పిండితో రొట్టెలు,దోసలు వంటి వాటిని చేసుకొని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పిండిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా, గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఈ పిండిని Super Food గా చెప్పుతారు.

Buckwheat తృణధాన్యం కాకపోయిన…ఒక తృణధాన్యం వలె చెప్పుతారు. దీనిలో రుటిన్ అనే ఫైటోన్యూట్రియెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో కూడా బాగా సహాయపడుతుంది.

దీనిలో గ్లైసెమిక్ సూచిక చాలా తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చు తగ్గులు లేకుండా చేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. దీనిలో 12 రకాల అమైనో ఆమ్లాలు ఉండుట వలన కండరాల బలానికి మరియు పెరుగుదలకు సహాయపడుతుంది. జింక్ మరియు సెలీనియం ఉండుట వలన వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకల సమస్యలను తగ్గిస్తుంది.

ఈ పిండిలో విటమిన్ ఇ మరియు మెగ్నీషియం ఉండుట వలన ఇవి రెండూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేసి శ్వాసనాళాలు వాపును తగ్గించి ఆస్తమా నివారణలో సహాయపడుతుంది. ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది.

రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. Buckwheat లో ఉండే ఫ్లేవనాయిడ్‌లు, టోకోఫెరోల్స్, సెలీనియం మరియు ఫెలోనిక్ యాసిడ్ లు వ్యవస్థ నుండి ఫ్రీ రాడికల్ ఏజెంట్‌లను నిర్మూలించి వ్యాధులు మరియు ఇన్‌ఫెక్షన్లు రాకుండా నివారిస్తాయి. ప్రేగు కదలికల పనితీరు మెరుగుపరచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది.

కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గుతారు. బరువు టాగ్గాలని అనుకొనే వారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. గోధుమలను ఎలా ఉపయోగిస్తామో ఈ Buckwheat ను కూడా అలానే ఉపయోగించవచ్చు. వీటిని ఉపయోగించి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."