నరాల బలహీనత,తిమ్మిర్లు తగ్గించి శరీరంలో ఉన్న ప్రతి నరంలో బలాన్ని పెంచుతుంది
Home Treatment For Nerve Pain In telugu : నరాల బలహీనత అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఈ సమస్య ఉన్నప్పుడు కాళ్లు, చేతులు వణకడం, మాట్లాడే క్రమంలో కండ్ల నుంచి నీరు కారడం, అనుకోని సంఘటనలు చూసినా, విన్నా గుండె దడదడ లాడటం, బరువు లేని వస్తువులు కూడా మోయటానికి శక్తీ లేకపోవడం, రాయాలంటే చేతులు వణకడం తదితర సమస్యలను చూస్తుంటాం.

ఈ నరాల బలహీనత కారణంగా ఏ పని చేయలేక చాలా తొందరగా అలసటకు గురి అవుతారు. ఆహారం లోపం వలన ,ఫిజికల్ గా ఎటువంటి పని చేయకపోయినా,వయస్సు పెరిగే కొద్దీ ఈ నరాల బలహీనత వస్తుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే ఈ నరాల బలహీనత నుంచి బయట పడవచ్చు.

సాధారణంగా నరాల బలహీనత రాగానే చాలా మంది టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఆలా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ఉపశమనం కలుగుతుంది. నరాల బలహీనతను తగ్గించటానికి ఆపిల్ సైడర్ వెనిగర్ సహాయపడుతుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే పొటాషియం, మెగ్నీషియం నరాలకు సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి తాగాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు తాగాలి. రుచి కోసం అవసరం అయితే అరస్పూన్ తేనె కలపవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. స్నానం చేసే గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపితే నరాలు రిలాక్స్ అవుతాయి.

గోరువెచ్చని నీరు కాళ్లకు రక్త ప్రసరణను పెంచి ఒత్తిడిని తగ్గించి నరాలు బలహీనంగా లేకుండా నొప్పి లేకుండా చేస్తుంది. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నరాల బలహీనత మరియు నరాలకు సంబందించిన సమస్యలను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా పాలల్లో పావు స్పూన్ లో సగం పసుపు వేసి బాగా కలిపి తాగాలి. రోజు విడిచి రోజు పసుపు పాలను తాగాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

