Healthhealth tips in telugu

పాలలో ఈ పొడి కలిపి తాగితే బరువు తగ్గడమే కాదు మరెన్నో ప్రయోజనాలు…అసలు ఊహించరు

weight Loss Drink In Telugu : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి, ఒత్తిడి,ఎక్కువసేపు కూర్చొని ఉండటం, హార్మోన్స్ సమస్యలు ఇలా ఎన్నో రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది బాధపడుతున్నారు. మార్కెట్ లో దొరికే రకరకాల పొడక్ట్స్ వాడుతూ ఉంటారు.
sompu
అలా కాకుండా బరువు తగ్గటానికి ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే పొడి పాలల్లో కలిపి తీసుకుంటే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ పొడిని రెగ్యులర్ గా వాడితే బరువు తగ్గడమే కాకుండా మరెన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పొడి ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
Ajwain Health Benefits In Telugu
పొయ్యి వెలిగించి పాన్ పెట్టి దానిలో ఒక స్పూను సోపు గింజలు, ఒక స్పూను వాము, అంగుళం దాల్చిన చెక్క, ఒక స్పూన్ మిరియాలు, ఐదు యాలకులు వేసి మంచి ఫ్లేవర్ వచ్చేవరకు వేయించాలి. ఇలా వేగించిన పదార్థాలు కాస్త చల్లారాక మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి.

ఈ పొడిలో ఒక స్పూన్ ఆర్గానిక్ పసుపు, ఒక స్పూన్ అశ్వగంధ పొడి, మూడు స్పూన్ల బాదం పొడి, ఒక స్పూను శొంఠి పొడి, రుచికి సరిపడా పట్టిక బెల్లం ముక్కలు వేసి మరల మెత్తని పొడిగా మిక్సీ చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడిన డబ్బాలో పోసి ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా నెల రోజులపాటు నిల్వ ఉంటుంది.
cardamom in telugu
ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో అర స్పూన్ పొడి వేసి బాగా కలిపి ఉదయం సమయంలో తాగాలి. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు క్రమంగా కరిగి బరువు తగ్గుతారు. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.. ఎముకలు., కండరాలు దృఢంగా మారతాయి. నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ పాలను రాత్రి సమయంలో తాగితే మంచి ఫలితం ఉంటుంది. జలుబు దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.