భరించలేని తలనొప్పా? ఇలా చేస్తే 5 నిమిషాల్లో తగ్గిపోతుంది!
Migraine Headache Home Remedies In Telugu : భరించలేని తలనొప్పి లేదా మైగ్రేన్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారా? ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే కేవలం 5 నిమిషాల్లో తలనొప్పిని తగ్గించుకునే అద్భుతమైన న్యాచురల్ చిట్కా ఏంటో ఇక్కడ తెలుసుకోండి. ఈ సింపుల్ హోమ్ రెమెడీతో తక్షణ ఉపశమనం పొందండి.
తలనొప్పి వచ్చిందంటే ఒక పట్టానా తగ్గదు. మనలో చాలామంది తలనొప్పి రాగానే షాప్ కి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకోవడం వల్ల కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నార్మల్ తలనొప్పి అయినా మైగ్రేన్ తలనొప్పి అయినా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.

మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. వారి జీవనశైలిలో కొన్ని మంచి మార్పులు చేసుకోవడం ద్వారా మైగ్రేన్ సమస్యను కొంత వరకు తగ్గించుకోవచ్చు. ప్రతి రోజూ ప్రాణాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు చెప్పే ఆహారాలను తీసుకుంటే మైగ్రైన్ తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారికి ఆవు నెయ్యి ఔషధంలా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ప్రతి రోజు అరస్పూన్ మోతాదులో ఆవు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యిని ఆహారంలో చేర్చి తీసుకోవచ్చు. అలాగే పాలల్లో కలిపి తాగవచ్చు. మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు ఉదయాన్నే హెర్బల్ టీని తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
రాత్రి సమయంలో ఒక బౌల్ లో 6 ఎండు ద్రాక్షలను వేసి నీటిని పోసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఎండుద్రాక్షను తింటూ ఆ నీటిని తాగాలి. రాత్రి సమయంలో ఎండు ద్రాక్షను నానబెట్టటం కుదరని వారు కనీసం 5 గంటల పాటు నానబెట్టి తినవచ్చు. ఇది మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయ పడుతుంది. ఇది ఎసిడిటీ, వికారం, బర్నింగ్ సెన్సేషన్, మైగ్రేన్ మొదలైన మైగ్రేన్‌తో సంబంధం ఉన్న అన్ని లక్షణాలను తగ్గిస్తుంది.
జీలకర్ర,యాలకుల టీ మైగ్రైన్ తలనొప్పిని తగ్గించటానికి సహాయపడుతుంది. జీలకర్ర ఏలకుల టీని లంచ్ లేదా డిన్నర్ చేసిన ఒక గంట తర్వాత లేదా మైగ్రేన్ లక్షణాలు కనిపించినప్పుడు తీసుకోవచ్చు. ఇది వికారం మరియు ఒత్తిడిని తగ్గించడానికి పనిచేస్తుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి అరస్పూన్ జీలకర్ర, ఒక ఏలకును వేసి 5 నిమిషాలు మరిగించి వడకట్టి తాగాలి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

